నేపాల్ తాత్కాలిక సారథిగా సుశీలా కర్కీ?.. ‘జెన్‌జడ్’ చర్చలు!

ఖాట్మండ్: కల్లోల నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత (జెన్‌జెడ్) ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపు జెన్‌జెడ్ ఉద్యమకారులు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అవినీతికి వ్యతిరేకంగా నేపాల్‌లో కొనసాగుతున్న ఉద్యమం హింసాత్మక సంఘటనలకు దారి తీయడంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు […]

కూకట్‌పల్లిలో గృహిణి దారుణహత్య

గృహిణి దారుణ హత్యకు గురైన సంఘటన కూకట్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… రేణు అగర్వాల్ (50) అనే మహిళ కుటుంబంతోపాటు కూట్‌పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. ఇంట్లోకి వచ్చిన నిందితులు రేణు కాళ్లు, చేతులు కట్టేసి హత్య చేశారు. నిందితులు మహిళను కాళ్లు, చేతులు కట్టేసి ఇంట్లో చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో పనిచేసే జార్ఖండ్‌కు చెందిన ఇద్దరు యువకులు కన్పించకపోవడంతో వారిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. Also Read: […]

మంత్రిగా నియమితులైన కొంతసేపటికే కుప్పకూలిన మంత్రి

స్టాక్‌హోమ్ : స్వీడన్ ఆరోగ్యశాఖ మంత్రి ఎలిసాబెట్ లాన్ విలేకర్లతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మంత్రిగా నియమితులైన కొంతసేపటికే ఇది జరగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ విలేకరుల సమావేశంలో ఎలిసాబెట్ లాన్‌ను ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. అక్కడ ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడంతోనే […]

పిడుగుపాటుకు ఏడుగురు మృతి

రాష్ట్ర వ్యాప్తంగా పిడుగు పాటుకు ఏడుగురు మృతి చెందారు. నిర్మల్ జిల్లాల్లో ఇద్దరు దంపతులతో పాటు ఒక వ్యక్తి మృతి చెందగా, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ముగ్గురు కూలీలు మృత్యువాతపడ్డారు. ఖమ్మం జిల్లాల్లో ఒక్కరు పిడుగు పాటుకు బలయ్యారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మేన ఏంగ్లాపూర్ గ్రామానికి చెందిన దంపతులు అల్లేపు ఎల్లయ్య, ఆల్లేపు ఏళ్లవ్వతో పాటు బండారు వెంకటిలు గ్రామ సమీపంలో వ్యవసాయ పనులకు వెళ్లారు తిరిగి వస్తున్న క్రమంలో పిడుగు పడటంతో అక్కడిక్కడే […]

రష్యా డ్రోన్లను కూల్చివేసిన నాటో దేశం

వార్సా : ఎలాంటి అనుమతి లేకుండా పోలండ్ గగనతలం లోకి ప్రవేశించిన రష్యా డ్రోన్లను పోలండ్ ముందు జాగ్రత్తగా కూల్చి వేసింది. నాటో సభ్య దేశం లోకి డ్రోన్లు ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ గగనతలం లోకి డ్రోన్లు ప్రవేశించడంపై నాటో సెక్రటరీ జనరల్‌కు సమాచారం ఇచ్చామని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ చెప్పారు. ఈ సందర్భంగా టస్క్ ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని […]

నేపాల్‌లో ఆర్మీ కర్ఫూ.. భారత సరిహద్దులో హై అలర్ట్

ఖాట్మండ్: నేపాల్‌లో ఆర్మీ కర్ఫూ ప్రకటించింది. మరోవైపు నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ బుధవారం నిరసనకారుల బృందంతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో యువ ఆందోళనకారులు తమ డిమాండ్లను వెల్లడించారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న భారత్… సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. కేపీ శర్మ ఓలీ ప్రధాని పదవికి రాజీనామాచేసిన తరువాత తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు పరిస్థితులను చక్కదిద్దే బాధ్యతలను ఆర్మీ తీసుకుంది. ఈమేరకు సైనికులు రాజధాని […]

రేపు ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ 15వ భారత ఉపరాష్ట్రపతిగా సెప్టెంబర్ 12న బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ మేరకు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామ చేయడంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఎన్డీయే అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ . ప్రతిపక్ష ఇండి కూటమి అభ్యర్థిగా సుప్రీం కోర్టు మాజీ […]

డైవర్షన్ పాలిటిక్స్ మానండి:హరీశ్‌రావు

దేశ చరిత్రలో యూరియా కోసం రైతులు ఇంతగా తిప్పలు పడ్డ పరిస్థితులు ముందెన్నడూ లేదని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్‌ఎ హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం నడిరోడ్ల వెంట బారులు తీరుతున్నారని, ఆధార్ కార్డు, పాస్ బుక్కులు చేత పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నరని, పండుగ లేదు..పబ్బం లేదు..వాన లేదు..ఎండ లేదు, రాత్రి లేదు, పగలు లేదు క్యూలో […]

ఆసియా కప్ 2025: 4.3 ఓవర్లలోనే భారత్ విజయం

దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన రెండవ మ్యాచ్‌లో యుఎఇపై టీమిండియా ఘన విజయం సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి మ్యాచ్ ను ముగించేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(30), శుభ్ మన్ గిల్(20 నాటౌట్)లు రాణించారు. దీంతో ఆసియా కప్ లో భారత్ బోణి కొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ […]

ఓటు చోరీ నినాదంతో ప్రజల్లోకి.. రాహుల్ గాంధీ వెల్లడి

రాయ్‌బరేలీ: దేశ ప్రజల ముందుకు కాంగ్రెస్ పార్టీ.. ఓటు చోర్, గద్ది చోడ్ నినాదంతో మరింత బలంగా వెళ్లుతుందని పార్టీ నేత రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజల నిజమైన ప్రజాస్వామిక ఓటు హక్కు చోరీ అయిందని, దేశవ్యాప్తంగా ఇది జరిగిందని చెప్పారు. ఇదే విషయాన్ని తమ పార్టీ రాబోయే రోజులలో మరింత ఆశ్చర్యకర నాటకీయ ఉదాహరణలతో ప్రజల ముందుంచుతుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని తమ సొంత పార్లమెంటరీ నియోజకవర్గం రాయ్‌బరేలీలో రెండు రోజుల పర్యటనకు రాహుల్ బుధవారం వచ్చారు. […]