కాలేజీలో కాల్పులు: ఎంబిఎ విద్యార్థి మృతి

MBA student found dead

లక్నో: కాలేజీ హాస్టల్ రూమ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక ఎంబిఎ విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థి త్రీవంగా గాయపడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దీపక్ కుమార్(22) యుపిలో బిమ్ టెక్ కాలేజీలో ఎంబిఎ చదువుతున్నాడు. అదే కాలేజీలో ఆగ్రా చెందిన దేవాన్షు చౌహాన్ పిజిడిఎం చదువుతున్నాడు. ఇద్దరు కాలేజీకి సంబంధించిన ఆర్ సిఐ విద్యావిహార్ హాస్టల్‌లో ఉంటున్నారు. రూమ్‌లో దేవాన్షు, […]

రూ.1000 కోట్లు సినిమాలు లేవు కానీ… ఆ వ్యాధి నాకు ఎంతో నేర్పింది: సమంతా

Samantha comments on Myositis

ఢిల్లీ: ప్రతి శుక్రవారం వచ్చిందంటే చాలు తనలో భయాందోళనలు ఉండేవని హీరోయిన్ సమంత తెలిపారు. తన స్థానాన్ని ఎవరో ఒకరు భర్తీ చేస్తారని, శుక్రవారం బాక్సాఫీసు నంబర్లు లెక్కపెట్టుకుంటూ ఉండేదానని వివరించారు. మయో సైటిస్ తనకు ఎన్నో నేర్పడంతో పాటు తనలో పెనుమార్పులు తీసుకొచ్చిందన్నారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంతా మాట్లాడారు. ఒకే సంవత్సరంలో ఐదు సినిమాలు విడదలైన సందర్భాలు ఉన్నాయని, ఇదే విజయమని అనుకున్నానని పేర్కొన్నారు. విరామం లేకుండా సినిమాలు చేయడం అని నమ్మేదానని, […]

ప్రమాదం నుంచి తప్పించుకున్న బాలిక

Girl falls manhole

హైదరాబాద్: పాతబస్తీలోని యాకుత్‌పురాలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. మూత లేని మ్యాన్‌హోల్ కారణంగా ఆరు సంవత్సరాల బాలిక ప్రమాదానికి గురైంది. తన తల్లితో కలిసి పాఠశాలకు వెళ్తుండగా మౌలా కా చిల్లా ప్రాంతంలో ఓపెన్ మ్యాన్‌హోల్‌లో బాలిక పడిపోయింది. వెంటనే అప్రమత్తమైన తల్లి, స్థానికుల సహాయంతో బాలికను సురక్షితంగా బయటకు తీశారు. సకాలంలో సహాయం అందడంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. జిహెచ్ఎంసి సిబ్బంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు. Also Read […]

ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ సైకోయిజం మారలేదు: గొట్టిపాటి

Gottipati Ravikumar comments jagan

అమరావతి: ప్రజల స్పందన చూసి వైసిపి జగన్ మోహన్ రెడ్డికు అసహనం పెరిగిపోయిందని ఎపి మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సూపర్ 6 సూపర్ హిట్ సభకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు పలికారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురం సభతో వైసిపి దుకాణం పూర్తిగా మూతపడినట్లేనని, ప్రజలు బుద్ధి చెప్పినా తన సైకోయిజం మారలేదని జగన్ నిరూపించారని విమర్శించారు. జగన్ మళ్లీ అధికారం లోకి రావడం కల్లేనని, యూరియా కొరతపై రైతు […]

నెల్లూరులో రిక్షాలో తరలించిన మృతదేహం

dead body on rickshaw

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కలిగిరిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌ యాజమన్యం మానవత్వం మరిచింది. అంబులెన్స్‌ రాకముందే మృతదేహాన్ని రిక్షాలో ప్రభుత్వాస్పత్రికి తరలించింది. ఈ వీడియో చిత్రీకరించిన మీడియాపై ఆస్పత్రి దురుసుగా ప్రవర్తించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బందిపై నెటిజన్లు మండిపడుతున్నారు. విలువల కంటే ఆస్పత్రులు డబ్బుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని దుయ్యబట్టారు.

డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లి కిర్క్ మృతి

conservative activist Charlie Kirk Gun fire

అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లి కిర్క్ (31) హత్యకు గురయ్యాడు. ఉటా వ్యాలి యూనివర్శిటీలో జరుగుతున్న కార్యక్రమంలో మాట్లాడుతుండగా దుండగుడు తుపాకీ కాల్పులకు దిగాడు. అమెరికాలో మాస్ షూటింగ్స్ పై వర్శిటీలో చర్చా కార్యక్రమానికి చార్లి కిర్క్ పాల్గొన్నారు. ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తుండగా దుండగలు కాల్పులు జరిపారు. దీంతో వెంటనే పోలీసులు తీవ్రగాయాలైన చార్లి కిర్క్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు అధ్యక్షుడు ట్రంప్ ధ్రువీకరించారు. […]

మద్యం మత్తులో మేనత్తను హత్య చేసిన మేనల్లుడు

Atrocity VRK Puram Venkatapuram Mandal

ములుగు: వెంకటాపురం మండలం విఆర్కె పురంలో దారుణం చోటు చేసుకుంది. మేనత్తను గొడ్డలితో ఓ మేనల్లుడు చంపాడు. మేనల్లుడు గత కొంత కాలంలోమద్యానికి బానిసయ్యాడు. మందుకు డబ్బులు లేకపోవడంతో తన మేనత్తను మద్యానికి డబ్బులు అడిగాడు. లేవు అని చెప్పడంతో  వీళ్ల గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మేనత్తను హత్య చేశాడు. ఈ ఘటన వెంకటాపురం మండలం విఆర్కె పురంలో జరిగింది. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. […]

గొంతు ద్వారా గుండె కవాట మార్పిడి

Heart operation telugu

చాతి ద్వారా ధర్నం స్టెర్ర్నం బోన్ ని కట్ చేసి గుండెలోని అయోర్టిక్ కావటాన్ని మార్చడం అనేది సాధారణంగా జరిగే ఆపరేషన్ పధ్దతి.. దీని తర్వాత పేషెంట్ కు ఎక్కువ నొప్పి ఉండకూడదు అని మినీ స్టెర్నాటమి అని, ఎంఐసిఎస్ అని, ట్రాన్స్ ఆక్సిలరీ ఎంఐసిఎస్ అని రకరకాల చిన్న కోత ఆపరేషన్లు వచ్చాయి.. ఇప్పుడు అసలు ఛాతి మీదనే స్కార్స్ లేకుండా స్టెర్న్నం బోన్ ను కట్ చేయకుండా గొంతు నుంచి అయోర్టిక్ కావాటాన్ని మార్చే […]

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలి: అనిల్

Better services provided tirumala devotees

తిరుమల: కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు మరింత సేవా దృక్పధంతో, మరింత బాధ్యతగా సేవలు అందించాలని నూతనంగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింఘాల్ ఉన్నతాధికారులకు దశ దిశ నిర్దేశించారు. తిరుమల శ్రీ అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో బుధవారం ఉన్నతాధికారులతో పరిచయ కార్యక్రమం, సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇఒ అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడారు. శ్రీవారి వార్షిక  బ్రహ్మోత్సవాలు కేవలం 2 వారాలు మాత్రమే ఉన్నాయని, గడువు లోపుగా […]

త్రాచుపామును మెడలో వేసుకొని…. వణికించిన వృద్ధుడు (వీడియో వైరల్)

old man played cobra

అమరావతి: కోళ్ల గంపలో ఉన్న పాము ఓ వృద్ధుడిని కాటు వేసింది. మద్యం మత్తులో వృద్ధుడు పామును మెడలో వేసుకొని హల్ చల్ చేశాడు. ఈ సంఘటన  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జరిగింది. కోడిగుడ్డు కోసం తన ఇంటి ఆవరణలో కోళ్లను ఉంచిన గంప దగ్గరకు గొల్లపల్లి కొండ అనే వృద్ధుడిని వెళ్లాడు. గంపలో త్రాచుపాము ఉండడంతో ఆ వృద్ధుడిని కాటేసింది. మద్యం మత్తులో వృద్ధుడు తననే కాటు వేస్తావా? అని పామును […]