‘ట్రాన్స్‌ ఆఫ్‌ ఓమి’.. #OG విలన్‌ పవర్‌ఫుల్‌ సాంగ్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న క్రేజీ మూవీ ‘ఓజి’ నుంచి మరో పవర్‌ఫుల్‌ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పవర్‌ఫుల్‌ ‘ఓమి’ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే పవన్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఓమి క్యారెక్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ పేరుతో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. అద్వితీయ […]

దేశానికి సీడ్ హబ్ గా రాష్ట్రం: మంత్రి తుమ్మల

దేశానికి సీడ్ హబ్ గా రాష్ట్రం నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఇండియా, ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశ అవసరాల్లో 60 శాతం విత్తనాలను రాష్ట్రం నుంచే సరఫరా చేయడమే కాకుండా, 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామన్నారు. రాష్ట్ర విత్తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మంత్రి వివరించారు. వెయ్యికి పైగా విత్తన కంపెనీలు, […]

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. భద్రత దళాలు దాదాపు 10 మంది మావోయిస్టులను హతమార్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అగ్ర మావోయిస్టు కమాండర్ మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్‌తో పాటు మరో తొమ్మిది మంది నక్సలైట్లు మృతి చెందారని తెలిపారు. ఎన్‌కౌంటర్ ఇంకా కొనసాగుతుందని.. మరణించినవారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. రాయ్‌పూర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అమ్రేష్ మిశ్రా ఎన్‌కౌంటర్ గురించి వివరాలను వెల్లడిస్తూ.. […]

ఐఈడి బాంబు పేలి ఇద్దరు జవాన్లకు తీవ్రగాయాలు

ఐఈడి బాంబు పేలి ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడిన సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బర్సూర్ ప్రాంతంలో సత్ధర్, మాలేవాహి మధ్య జరిగిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో మావోయిస్టులు అమర్చిన ఐఈడి పేలి ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. గాయపడిన జవాన్లను హుటాహుటిన దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించారు.దంతెవాడ జిల్లా ఎస్పీ గౌరవ్ రాయ్ ఈ ఘటనను ధృవీకరించారు. Also Read: మద్యం మత్తులో మేనత్తను […]

గ్రూప్ 1 పోస్టుల అమ్మకాల ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి:కెటిఆర్

గ్రూప్ 1 పోస్టుల కోసం డబ్బులు చేతులు మారాయని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలపైన ప్రభుత్వం స్పందించాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్ 1 అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు నేరుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో తగిన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రూప్ 1 పోస్టుల కోసం భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్లు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న […]

కెటిఆర్‌కు అరుదైన గ్లోబల్ గౌరవం

KTR

భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కె.టి. రామారావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. సుస్థిర పాలన, పర్యావరణ పరిరక్షణలో ఆయన చేసిన కృషికి గాను ప్రతిష్టాత్మకమైన ‘గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025’కు ఆయన ఎంపికయ్యారు. ఈ నెల చివరిలో అమెరికాలోని న్యూయార్క్‌లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవం సెప్టెంబర్ 24న న్యూయార్క్‌లో జరగనున్న 9వ ఎన్‌వైసి గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో జరగనుంది. ఈ విషయాన్ని గ్రీన్ మెంటార్స్ సంస్థ అధికారికంగా […]

కాల్పుల్లో ట్రంప్ మిత్రుడు జార్లి కిర్క్ మృతి

ఉటా లోని ఒరెమ్ లోని ఉటా వ్యాలీ యూనివర్సిటీలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, మితవాద అమెరికన్ కార్యకర్త చార్లీ కిర్క్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. మెడపై తుపాకీతో జరిపిన కాల్పులలో చార్లీ మరణించారు. కిర్క్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాల్పులు జరిగిన క్షణంలో చిత్రీకరించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హత్యకు సంబంధించి సెల్ ఫోన్ వీడియో క్లిప్ లలో కిర్క్ యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో జనాల్ని ఉద్దేశించి […]

పోక్సో కేసులో జీవితఖైదు శిక్ష

పోక్సో కేసులో నిందితుడికి జీవితఖైదు, రూ.26,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్‌లోని పోక్సో కోర్టు గురువారం తీర్పు చెప్పింది. మేడ్చల్ జిల్లా, ఉప్పల్ మండలం, నాగోల్‌బండ్లగూడకు చెందిన దండుల సాయికుమార్ సెంట్రింగ్ వర్క్ చేస్తున్నాడు. నిందితుడి సమీపంలో ఉంటున్న బాలికపై నిందితుడు అత్యాచారం చేశాడు. విషయం బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఎల్‌బి నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను వైద్య పరీక్షలకు పంపించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు […]

వైట్ కార్డు ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి: నాదెండ్ల

Distribution goods ration shops

అమరావతి: ఎపిలో వృద్ధుల ఇళ్లకు వెళ్లి రేషన్ సరుకులు ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రతినెలా 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే 96.5 శాతం ఇకెవైసికి అర్థం (“ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్”) ఇది ఒక డిజిటల్ ప్రక్రియ. చేసిన ఏకైక రాష్ట్రం ఎపి అని నాదెండ్ల  కొనియాడారు. ఈ నెల 15 నుంచి అన్నిజిల్లాల్లో కార్డులు పంపిణీ జరుగుతుందని అన్నారు. […]

పాలకుర్తిలో ఆస్తి కోసం కన్నతల్లిని చంపిన కూతురు

Palakurthi Jangaon

జనగామ: ఆస్తి కోసం కన్నతల్లిని కసాయి కూతురు చంపింది. ఈ సంఘటన  జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన లక్ష్మి అనే మహిళకు సంగీత అనే కూతురు ఉంది. ఐదేళ్ల క్రితం  వీరయ్య అనే యువకుడితో తన కూతురు పెళ్లి చేసింది. వివాహ సమయంలో కట్నం కింద లక్ష్మి తన ఎకరం భూమిలో 20 గుంటలు అమ్మి, ఆ డబ్బుతో 9 తులాల బంగారం చేయించి కూతురుకి కట్నం […]