ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు

2007లో విజయవాడలో జరిగిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సుదీర్ఘంగా పలుమార్లు పోలీసులతో పాటు సిబిఐ కూడా విచారించాయి. నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని సిబిఐ కోర్టు అయేషా తల్లిదండ్రులు బాషా, సంషేద బేగంకు శుక్రవారం నోటీసులు ఇచ్చింది. సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించడంతో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. […]

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ

Sushila Karki

ఖాట్మండూ: సోషల్‌మీడియా బ్యాన్, అవినీతి పాలన తదితర కారణాలతో నేపాల్ భగ్గుమన్న విషయం తెలిసిందే. జెన్‌-జెడ్ యువత ఆందోళనలతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్లింది. ఈ అల్లర్ల నేపథ్యంలో కెపి శర్మ ఓలీ.. నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆ దేశ పార్లమెంట్‌ రద్దైంది. తర్వాత ప్రధానిగా మాజీ చీఫ్‌ జస్టిస్ సుశీల కర్కీని (Sushila Karki) తాత్కాలిక ప్రధానిగా ఉద్యమకారులు ఎన్నుకున్నారు. సుశీల కర్కీ(72) తొలుత ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత […]

గిరిజన సంక్షేమ శాఖకు రూ.11 కోట్లు విడుదల

రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో వివిధ చెల్లింపుల కింద పెండింగ్‌లో ఉన్న బకాయిలు రూ.11 కోట్లు విడుదల చేశామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఈ ఏడాది జూలై, ఆగస్టు- నెలలకు గాను టీజీడబ్ల్యుఆర్‌ఈఐ సొసైటీకి చెందిన కాంట్రాక్టు, ఔట్సోర్స్, పార్ట్ టైైమ్ సిబ్బందికి, సబ్జెక్ట్ అసోసియేట్స్, హెడ్‌ఆఫీస్లో పనిచేస్తున్న సిబ్బందికి, అలాగే స్వీపింగ్, శానిటేషన్, కేటరింగ్ సేవలకు సంబంధించి రెమ్యునరేషన్, సర్వీస్ ఛార్జీలు కింద రూ.11.53 కోట్లు విడుదల […]

ఒమాన్‌తో మ్యాచ్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

Pakistan

దుబాయ్: ఆసియాకప్-2025లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా.. తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ జట్టు పసికూన ఒమాన్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ (Pakistan) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌కి ముందు పాకిస్థాన్.. అఫ్ఘానిస్థాన్, యుఎఇతో ముక్కోణపు సిరీస్‌లో పాల్గొంది. గత రెండు-మూడు నెలలుగా తమ జట్టు మంచి క్రికెట్ ఆడుతుందని టాస్ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నాడు. ఇక ఒమాన్ కెప్టెన్ జితేందర్ సింగ్.. మాట్లాడుతూ.. తమ […]

కామారెడ్డి కాంగ్రెస్ సభకు వర్షం దెబ్బ

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న బహిరంగ సభకు వర్షం దెబ్బ పడింది. తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. బిసిలకు అధికారంలోకి వస్తే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది. అందుకే ‘కామారెడ్డి డిక్లరేషన్’ అనే నామకరణం చేశారు. అయితే రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, ఎదురైన సవాళ్ళను వివరించేందుకు కామారెడ్డిలో బహిరంగ సభ […]

గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించండి: బూర నర్సయ్య గౌడ్

గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూపు 1 పరీక్ష, నియామకాలు సరైన విధంగా జరగలేదని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గ్రూపు 1 నిర్వహించగా, అది కూడా అనేక అవకతవకలు, అవినీతి కారణంగా పరీక్ష రద్దయ్యిందని ఆయన గుర్తు చేశారు. పరీక్షల నిర్వహణ విషయంలో […]

కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపండి:రాంచందర్ రావు

కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపించండి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కేబుల్ వైర్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహారిస్తున్నదని ఆయన విమర్శించారు. శుక్రవారం అనేక మంది కేబుల్ ఆపరేటర్లు తార్నాకలోని రాంచందర్ రావు నివాసానికి వెళ్ళి ఎదుర్కొంటున్న సమస్యను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించకుండా కేబుల్ వైర్లను తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. […]

టేకాఫ్ సమయంలో ఊడిన విమానం టైర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Spicejet

ముంబై: స్పైస్‌జెట్ (Spicejet) సంస్థకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. గుజరాత్‌లోని కండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న క్యూ400 స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన సమయంలో టైర్ ఒకటి ఊడిపోయింది. అయితే అప్పటికీ ప్రయాణం కొనసాగించి ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విమాన ప్రమాదానికి గురైన సమయంలో అందులో 75 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన […]

సుప్రీం కోర్టు ఆవరణలో ఇవి చేస్తే.. ఇంకా అంతే సంగతులు

Supreme Court

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ప్రాంగంణం లోని హై సెక్యూరిటీ జోన్‌లో ఫోటోలు తీయడం.. రీల్స్ చేయడం పై నిషేధం విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్ 10న జారీ చేసిన ఈ ప్రకటనలో మీడియా సిబ్బంది, ఇంటర్వ్యూలు, వార్తలకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను కేవలం భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన జోన్‌లో మాత్రమే నిర్వహించాలని స్పష్టం చేసింది. కోర్టు ప్రాంగంణంలో అధికారిక వినియోగానికి మినహా.. వీడియోగ్రఫీ, రీల్స్ చేయడానికి, […]

బుమ్రాని ఉతికేస్తాడు.. ఆరు సిక్సులు కొడతాడు: పాక్ మాజీ ఆటగాడు

Jasprit Bumrah

ఆసియాకప్‌-2025లో అతిపెద్ద పోరు ఆదవారం జరగనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఆసక్తికర పోరును చూసేందు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌కి ముందు ఈరోజు(శుక్రవారం) పాకిస్థాన్.. ఒమన్‌తో తలపడనుంది. ఇఫ్పటికే ఈ సిరీస్‌లో భారత్.. యుఎఇతో తలపడింది. ఈ మ్యాచ్‌లోపసి కూన యుఎఇ అత్యంత చెత్త పదర్శన చేసింది. భారత్‌కు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో భారత్ ఈ మ్యాచ్‌లో గెలిచింది. (Jasprit Bumrah) అయితే ఇప్పుడు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ కోసం భారత్ […]