గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి

20 మందికి గాయాలు కర్నాటకలోని హసన్ జిల్లాలో గణేశ్ నిమజ్జన ఊరేగింపులో విషాదం హసన్ : కర్నాటకలోని హసన్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జన ఊరేగింపులో ఒక ట్రక్కు ఢీకొట్టడంతో 8 మంది మృతి చెందగా, మరో 20మంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. గణేశ్ చతుర్థి ఉత్సవాల ముగింపు రోజున మోసాలే హోసహళ్లి గ్రామంలో రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. […]

రాహుల్‌కు సిగ్గుందా?

KTR

తెలంగాణలో జరుగుతున్న ఎంఎల్‌ఎ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిగ్గుపడాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ‘ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరం’ అని పేర్కొన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియలో భాగస్వామి అయినందుకు రాహుల్ గాంధీకి సిగ్గుందా…? అని ప్రశ్నించారు. తెలంగాణలో కొనసాగుతున్న ఎంఎల్‌ఎల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ అవలంబిస్తున్న విధానాలపై కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో […]

15 నుంచి వృత్తి విద్యా కాలేజీలు నిరవధిక బంద్

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కానందుకు నిరసనగా ఈ నెల 15 నుంచి వృత్తి విద్యా కళాశాలల నిరవధిక బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫతి) ప్రకటించింది. ఇంజినీర్స్ డే సందర్భంగా ఈ నెల 15 నుంచి ఇంజనీరింగ్ సహా ఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, నర్సింగ్, బి.ఇడి తదితర 200 కళాశాలలు బంద్‌లో పాల్గొంటాయని ఫెడరేషన్ చైర్మన్ రమేష్ వెల్లడించారు. ఈ కాలేజీల్లో సుమారు 10 లక్షల మంది విద్యార్థులు […]

పిజి కోర్సుల్లో స్పోర్ట్స్ కోటా

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ముఖ గుర్తింపు హాజరు (ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్..- ఎఫ్‌ఆర్‌ఎస్) తప్పనిసరి చేయాలని వైస్ ఛాన్స్‌లర్ల సమావేశంలో నిర్ణయించా రు.ఇప్పటికే చాలా వర్సిటీలలో 60శాతానికిపైగా- ఎఫ్‌ఆర్‌ఎస్ హాజ రు విధానం అమలు చేస్తున్నట్లు, త్వరలోనే పూర్తి స్థాయిలో ముఖ గుర్తింపు హాజరు అమలుకు చర్యలు తీసుకుంటామని వైస్ ఛా న్స్‌లర్లు తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి అ ధ్యక్షతన శుక్రవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ల సమావేశం జరిగిం ది. ఈ […]

యూరియా వస్తోంది

మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రానికి మరో నాలుగు రోజుల్లో 27,650 మెట్రిక్ టన్నుల యూరియా రానుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా సరఫరాలపై వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, కమిషనరేట్ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని రామగుండం ఎరువుల కర్మాగారం(ఆర్‌ఎఫ్‌సిఎల్) తిరిగి పునరుద్ధరించేలా మరోసారి కేంద్రాన్ని కోరాలని అధికారులను ఆదేశించారు. రా ష్ట్రంలోని రైతులకు అవసరమైన ఎరువుల సరఫరా నిరంతరంగా కొనసాగించడానికి […]

కామారెడ్డి కాంగ్రెస్‌సభ వాయిదా

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న బహిరంగ సభకు వర్షం దెబ్బ పడింది. తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. బిసిలకు అధికారంలోకి వస్తే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో హామీ ఇచ్చింది. అందుకే ‘కామారెడ్డి డిక్లరేషన్’ అనే నామకరణం చేశారు. అయితే రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కృషి, ఎదురైన సవాళ్ళను వివరించేందుకు కామారెడ్డిలో బహిరంగ సభ […]

యూరియా దొరకలేదని రైతు ఆత్మహత్య

మన తెలంగాణ/ఇల్లందు : యూరియా బస్తాలు దొరకపోవడంతో పంట చేను చే తికి రాదన్న మనస్తాపంతో ఒక యువ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొ త్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం, ధనియాలపాడు పంచాయతీ పరిధిలోని సేవ్యాతండాలో ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సేవ్యాతండాకు చెందిన కున్సోత్ యాకయ్య కుమారుడు సుమన్ (35) యూరియా కోసం సహకార సంఘం చు ట్టూ ఎంత తిరిగినా దొరకపోవడంతో పంట చేను చేతికి రాదన్న […]

శనివారం రాశిఫలాలు (13-09-2025)

Sanivaram rasi phalalu Telugu

మేషం –  సంతానం పురోగతి గర్వించే విధంగా ఉండాలని మీరు భావిస్తారు, కానీ వాస్తవ జీవితంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. వృషభం – చాలామంది జీవితాలు మీ ఆలోచన విధానాల మీద మీ ఇష్టయిష్టాల మీద ఆధారపడి ఉంటాయి. కనుక ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. అన్ని విషయాలలోనూ లౌక్యం ప్రదర్శించడం మంచిది. మిథునం – బంధువులతో ఉన్న విభేదాలను పరిష్కరించి ఒక శుభకార్యం జరగడానికి మీరు కారుకులు అవుతారు. […]

నేపాల్ హింసాకాండలో 51కి చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌లో ఇటీవలి జెన్ జడ్ ఉద్యమంలో చెలరేగిన హింసాకాండలో మృతుల సంఖ్య 51కి చేరుకుంది. మృతులలో కొందరు మంటలలో చిక్కుకుని సజీవ దహనం చెందారు. ఉత్తర ప్రదేశ్‌లోని గజియాబాద్ నివాసి 57 సంవత్సరాల మహిళ రాజేష్ గోలా ఖాట్మండులోని హ్యాత్ రిజెన్సీ హోటల్‌లో బస చేసిన దశలో మృతి చెందారు.ఆమె వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ మంది యాత్రికులు ఉంటున్న ఈ హోటల్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. బయటపడే ఆమె నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకే […]

భయపెట్టిన ‘కిష్కింధపురి’

యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్, ‘చావు కబురు చల్లగా’ దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘కిష్కింధపురి’. హార్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? శ్రీనివాస్ కు మంచి విజయాన్నందించిందా? తెలుసుకుందాం. కథ: కిష్కింధపురి అనే ఊరిలో ప్రేమికులైన రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్).. మైథిలి (అనుపమ పరమేశ్వరన్).. దయ్యాల పట్ల ఆసక్తి ఉన్న వారిని హాంటెడ్ హౌస్‌లకు తీసుకెళ్లి ఘోస్ట్ వాకింగ్ టూర్లు నిర్వహిస్తుంటారు. […]