బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పది కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణ చేశారని పేర్కొంటూ రూ. 10 కోట్లకు సిటిసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని ఆగస్టు 11వ తేదీన సంజయ్‌కు కెటిఆర్ లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పడానికి బండి సంజయ్ నిరాకరించడంతో కెటిఆర్ సిటిసివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను […]

ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వేస్టేషన్ల అభివృద్ధి: బండి సంజయ్‌

మంచిర్యాలలో రూ.26 కోట్లతో అమృత్ భారత్ పనులు రూ.3.50 కోట్లతో పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడి మంచిర్యాలలో వందే భారత్ రైలు స్టాపేజీ ప్రారంభం మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్ 20101 నాగ్‌పూర్-సికింద్రాబాద్ రైలు స్టాపేజీని రాష్ట్ర […]

పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య

మన తెలంగాణ/చొప్పదండి: కరీంనగర్ కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ముద్దసాని కనుకయ్య (46) పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే…చొప్పదండి మండలం, రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనుకయ్య ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమితం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించే క్రమంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు […]

మురుగు కాలువలో గర్భస్థ శిశువు మృతదేహం

మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలో మురుగు కాలువలో సుమారు ఐదు నెలల గర్భస్థ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నెలలు నిండని ఆ పసికందును మురుగు కాలువలో పడేసిన తీరు మాతృత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉందని వాపోయారు. ఈ ఘటన చూసి మానవత్వం మంటకలిసిందని వ్యాఖ్యానించారు. అయితే, పసికందు మృతదేహాన్ని ఎవరు తెచ్చారు..ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది. Also Read:ఇందిరమ్మ ఇళ్లకు రూ.1435 కోట్ల చెల్లింపులు

హాంకాంగ్‌తో మ్యాచ్‌.. బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

Srilanka

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక (Srilanka) 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అదే జోరుతో హాంగ్‌కాంగ్‌పై కూడా విజయం సాధించాలని శ్రీలంక జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌ జట్టుతో ఓటమిని ఎదురుకున్న హాంగ్‌కాంగ్ జట్టు ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. తుది జట్లు: శ్రీలంక(Srilanka): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), […]

ఇందిరమ్మ ఇళ్లకు రూ.1435 కోట్ల చెల్లింపులు

ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారులకు అందచేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా, 1.29 లక్షల ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయని, వాటిలో సుమారు 20 వేల ఇళ్ల గోడలు, 8633 ఇళ్ల రూఫ్ పూర్తి అయ్యాయని ఎండి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లకు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల […]

రవితేజ వారసుడి నెక్ట్స్‌ మూవీ.. ఫస్ట్‌లుక్ అదుర్స్

Maadhav Bhupathiraju

టాలీవుడ్‌లో ఎవరి సపోర్ట్ లేకుండా హీరోగా ఎదిగారు మాస్ మహారాజా రవితేజా. ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో మాధవ్ భూపతిరాజు(Maadhav Bhupathiraju). మిస్టర్ ఈడియట్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు మాధవ్. ఇప్పుడు ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘మారెమ్మ’. ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. ఈరోజు మాధవ్ పుట్టినరోజు కావడంతో గ్లింప్స్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్‌లో మాధవ్ (Maadhav […]

‘ఒజి’ నుంచి మరో పాట.. ‘గన్‌ అండ్ రోజెస్’ అదిరిపోయిందిగా..

Guns n Roses

పవన్‌కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఒజి’. సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్‌డేట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘గన్‌ అండ్ రోజెస్’ (Guns n Roses) అనే పాటను విడుదల చేశారు. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ పాట పవన్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. యానిమేషన్‌లో ఉన్న ఫైటింగ్ సీక్వెన్స్‌లు […]

యుఎఇతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఒమాన్

OMAN

అబుదాబి: ఆసియా కప్‌లో భాగంగా షేక్ జాయెద్ స్టేడియం వేదికగా యుఎఇతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒమాన్ (OMAN) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో ఈ రెండు జట్లు ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇరు జట్లను కీలకంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి బోణీ కొట్టాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. అయితే ఒమాన్ బ్యాటింగ్‌కి ఆహ్వానించడంతో తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన యుఎఇ వికెట్ కాపాడుకుంటూ […]

‘మిరాయ్’కి ఆర్‌జివి రివ్యూ.. ఏమన్నారంటే..

Ram Gopal Varma

తేజా సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ గ్రాండ్ సక్సెస్‌ను సాధించింది. భారీ రాకలెక్షన్లు రాబడుతూ.. బాక్పాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇప్పటికే పలువురు సినీ విశ్లేషకులు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఈ సినిమాపై రివ్యూ ఇచ్చారు. ‘‘విఎఫ్ఎక్స్ ఇంత గ్రాండ్‌ చివరిసారి ఎప్పుడు చూశానో గుర్తులేదు. 400 కోట్లకు పైగా చిత్రాల్లో […]