చట్ట విరుద్ధంగా ఉంటే.. ‘సర్’ను రద్దు చేస్తాం: సుప్రీం హెచ్చరిక

governors duties begins

రాజ్యాంగబద్ధ సంస్థ నిబంధనలు పాటించిందనే భావిస్తున్నాం 7న తుది వాదనలు వింటాం, ఆ తర్వాత తీర్పు దేశ వ్యాప్తంగా నిలుపదల చేయలేం బీహార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ : బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్‌ఐఆర్’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను సోమవారం హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల […]

దెబ్బకు దిగొచ్చిన ట్రంప్.. విదేశీ ఉద్యోగులను నియమించుకోండంటూ పోస్ట్

వాషింగ్టన్ : అమెరికా పరిశ్రమలలో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యూఎస్‌లో పెట్టుబడుల గురించి తాము ఆలోచిస్తామంటూ దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అధ్యక్షుడు దెబ్బకు దిగొచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అక్రమ వలసల విషయంలో కఠినవైఖరి అవలంబిస్తున్నారు. వారిని గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదార్లను నిర్బంధించినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. […]

సినిమాల చిత్రీకరణ మరింత సులభతరం: దిల్ రాజు

రాష్ట్రంలో సినిమాల తయారీ ఇక సులభతరమని రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ(ఎఫ్‌డిసి) చైర్మన్ దిల్ రాజు అన్నారు. సినిమాల చిత్రీకరణ, సినిమాల చిత్రీకరణలకు కావాల్సిన అన్ని అనుమతులు, సినిమా థియేటర్ ల నిర్వహణకు పొందాల్సిన అనుమతులు, సినీ రంగాభివృద్దికి కావాల్సిన అనుమతులు అన్నీ సింగిల్ విండో ద్వారా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక వెబ్ సైట్ రూపొందిస్తోందని ఆయన వెల్లడించారు. సినిమా అనుమంతులపై రూపొందిస్తున్న ప్రత్యేక వెబ్ సైట్ ’ఫిలిమ్స్ ఇన్ తెలంగాణ‘ పై […]

వక్ఫ్ చట్టం 2025లో ఓ ప్రొవిజన్ నిలిపివేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: వక్ఫ్ సవరణ చట్టం 2025 లో కీలక ప్రొవిజన్‌ను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కనీసం ఐదేళ్ల పాటు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్ చేయడానికి అవకాశం ఉంటుందన్న దానిని నిలిపివేసింది. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్టు నిర్ణయించేలా నిబంధనలు తయారు చేసేవరకు ఇది అమల్లో ఉండదని చెప్పింది. అదే సమయంలో వక్ఫ్ (సవరణ)చట్టం2025 పై మొత్తంగా స్టే విధించడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. కొన్ని సెక్షన్లకు మాత్రం కొంత […]

బండి సంజయ్‌పై పది కోట్ల పరువు నష్టం దావా వేసిన కెటిఆర్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పది కోట్ల రూపాయల పరువునష్టం దావా వేశారు. ఫోన్ ట్యాంపింగ్ కేసులో బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణ చేశారని పేర్కొంటూ రూ. 10 కోట్లకు సిటిసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆరోపణలపై క్షమాపణ చెప్పాలని ఆగస్టు 11వ తేదీన సంజయ్‌కు కెటిఆర్ లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణ చెప్పడానికి బండి సంజయ్ నిరాకరించడంతో కెటిఆర్ సిటిసివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను […]

ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వేస్టేషన్ల అభివృద్ధి: బండి సంజయ్‌

మంచిర్యాలలో రూ.26 కోట్లతో అమృత్ భారత్ పనులు రూ.3.50 కోట్లతో పుట్‌ఓవర్ బ్రిడ్జి పనులు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడి మంచిర్యాలలో వందే భారత్ రైలు స్టాపేజీ ప్రారంభం మన తెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః కేంద్ర ప్రభుత్వం ఎయిర్‌పోర్టులను తలపించేలా రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేపడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందే భారత్ 20101 నాగ్‌పూర్-సికింద్రాబాద్ రైలు స్టాపేజీని రాష్ట్ర […]

పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య

మన తెలంగాణ/చొప్పదండి: కరీంనగర్ కమిషనరేట్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న ముద్దసాని కనుకయ్య (46) పురుగుల మందు తాగి హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే…చొప్పదండి మండలం, రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనుకయ్య ఆర్థిక పరిస్థితులు బాగా లేక ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమితం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కి తరలించే క్రమంలో మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు […]

మురుగు కాలువలో గర్భస్థ శిశువు మృతదేహం

మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రంలో మురుగు కాలువలో సుమారు ఐదు నెలల గర్భస్థ శిశువు మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నెలలు నిండని ఆ పసికందును మురుగు కాలువలో పడేసిన తీరు మాతృత్వానికి మచ్చ తెచ్చే విధంగా ఉందని వాపోయారు. ఈ ఘటన చూసి మానవత్వం మంటకలిసిందని వ్యాఖ్యానించారు. అయితే, పసికందు మృతదేహాన్ని ఎవరు తెచ్చారు..ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాల్సి ఉంది. Also Read:ఇందిరమ్మ ఇళ్లకు రూ.1435 కోట్ల చెల్లింపులు

హాంకాంగ్‌తో మ్యాచ్‌.. బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక

Srilanka

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక (Srilanka) 6 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అదే జోరుతో హాంగ్‌కాంగ్‌పై కూడా విజయం సాధించాలని శ్రీలంక జట్టు భావిస్తోంది. మరోవైపు బంగ్లాదేశ్‌ జట్టుతో ఓటమిని ఎదురుకున్న హాంగ్‌కాంగ్ జట్టు ఈ మ్యాచ్‌లో తిరిగి పుంజుకోవాలని పట్టుదలతో ఉంది. తుది జట్లు: శ్రీలంక(Srilanka): పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(కీపర్), […]

ఇందిరమ్మ ఇళ్లకు రూ.1435 కోట్ల చెల్లింపులు

ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,435 కోట్లను లబ్ధిదారులకు అందచేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి.గౌతం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం కాగా, 1.29 లక్షల ఇళ్ల పనులు పురోగతిలో ఉన్నాయని, వాటిలో సుమారు 20 వేల ఇళ్ల గోడలు, 8633 ఇళ్ల రూఫ్ పూర్తి అయ్యాయని ఎండి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లకు గృహ ప్రవేశాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల […]