వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను స్వాగతించిన కెటిఆర్
వక్ఫ్ సవరణ చట్టం 2025పై సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలపై బిఆర్‌ఎస్ మొదటి నుంచి తన ఆందోళనలను గట్టిగా వినిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టం ప్రగతిశీలత ముసుగులో దేశంలో విభజన రాజకీయాలకు, మత సామరస్యానికి విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తోందని తాము ఎప్పుడూ చెబుతూనే ఉన్నామని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టంలోని సమస్యలపైన తాము పోరాడామని తెలిపారు. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు […]