త్వరలో మహిళా పాలసీ ప్రకటిస్తాం : మంత్రులు సీతక్క, సురేఖ

సమాజంలో మహిళల పాత్ర కీలకమైనదని రాష్ట్ర మంత్రులు డి. అనసూయ సీతక్క, కొండా సురేఖలు అన్నారు. ప్రభుత్వం మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు సమర్థవంతంగా విధులు నిర్వహించి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ఫలితాలను ప్రజలకు అందించే దిశలో పని చేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రులు సూచించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన తెలంగాణ సెక్రటేరియట్ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంఘం లోగో ఆవిష్కరణ, సర్వ […]

రామ్‌గోపాల్‌వర్మపై మరో కేసు నమోదు

Ram Gopal Varma

వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై రిటైర్డ్ ఐపిఎస్ అంజనా సిన్హా హైదరాబాద్‌లో ఫిర్యాదు చేశారు. తన అనుమతి లేకుండా తన ఐడెంటిటీని తప్పుగా ఉపయోగించారని ఆమె రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దహనం అనే వెబ్‌సిరీస్‌లో తన అనుమతి లేకుండా తన ఫ్రొఫెషనల్ ఐడెంటిటీని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించారని అంజనా ఫిర్యాదులో పేర్కొన్నారు. ’దహనం’ వెబ్‌సిరిస్‌కు నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ, దర్శకుడు అగస్త్య మంజు. 2022లో చిత్రీకరించిన దహనం వెబ్‌సిరీస్‌పై ఫిర్యాదు వచ్చింది. కథ రాయల సీమ […]

బిజెపిది నకిలీ జాతీయవాదం: కెటిఆర్

వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బిఆర్‌ఎస్ స్వాగతించడాన్ని విమర్శిస్తున్న బిజెపి నేతలకు భారత రాజ్యాంగం, సుప్రీం కోర్టు మీద ఏమాత్రం గౌరవం లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. బిజెపిది నకిలీ జాతీయవాదమని, తమది మాత్రం ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టం చేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడినీ సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి (జింగోయిజం) […]

త్వరలో కిషోర బాలికా సంఘాలు : మంత్రి సీతక్క

మహిళా స్వయం సహాయక బృందాల తరహాలోనే కౌమార బాలిక సంఘాలను ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రకటించారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటు పై అధికారులకు మంత్రి సీతక్క దిశ నిర్దేషం చేశారు. కౌమార బాలిక సంఘాల ఏర్పాటుతో ఎన్నో సామాజిక రుగ్మతలను రూపుమాపవచ్చని మంత్రి పేర్కొన్నారు. బేగంపేటలోని జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌లో కౌమార బాలికల భద్రత, ఆరోగ్యం, పోషణ, […]

దారుణం.. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను తోసి చంపిన సవితి తల్లి

బెంగళూరు: కర్ణాటకలోని బీదర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను సవిత తల్లి కిందకు తోసి హత్య చేసిిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా సవితి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన ఆగస్టు 27న బీదర్ పట్టణంలోని ఆదర్శ్ కాలనీలో జరిగింది. 6 సంవత్సరాల బాలిక సాన్వి మూడవ అంతస్తు నుండి అకస్మాత్తుగా కింద పడి […]

భారతగడ్డపై తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టిన ఆసీస్ యువ క్రికెటర్

Sam Konstas

లక్నో: ఆస్ట్రేలియా-ఎ జట్టు ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తోంది. భారత్-ఏ జట్టుతో ఆసీస్ అనాధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. లక్నో‌లో ఏకనా స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్‌లో ఆసీస్ యువ క్రికెటర్ శామ్ కాన్‌స్టాస్(Sam Konstas) చెలరేగిపోయాడు. 114 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 109 పరుగులు చేశాడు. శామ్‌తో పాటు మరో ఓపెనర్ క్యాంపె‌బెల్‌ కూడా అద్భుత ప్రదర్శన చేశాడు. 97 బంతుల్లో 10 ఫోర్లు 2 సిక్సుల సాయంతో 88 […]

అత్యాచారం కేసులో దోషికి 24 ఏళ్ల జైలు శిక్ష

Nalgonda Court

నల్గొండ: పదేళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు (Nalgonda Court) సంచలన తీర్పు వెలువరించింది. దోషి మర్రి ఊషయ్యకు 24 ఏళ్ల జైతు శిక్షతో పాటు.. 40 వేల రూపాయిల జరిమానా విధిందచింది. ఇక బాలికకు రూ.10 లక్షలు నష్టపరిహాం చెల్లించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. 2023 మార్చిలో నల్గొండ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ పోక్సో కోర్టు ఇన్‌చార్జ్ జడ్జి రోజా రమణి తీర్పు వెలువరించారు. Also Read : […]

భారత క్రికెట్ జట్టు జెర్సీకి కొత్త స్పాన్సర్ ఎవరంటే..

Team India

ముంబై: భారత క్రికెట్ జట్టుకు (Team India) కొత్త జెర్సీ స్పాన్సర్ దొరికేసింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో డ్రీమ్ 11 భారత జట్టు జెర్సీ స్పాన్సర్‌గా ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో కొత్త స్పాస్సర్‌ లేకుండానే టీం ఇండియా ఆసియాకప్ బరిలోకి దిగింది. తాజాగా కొత్త స్పాన్సర్‌ కోసం బిసిసిఐ అభ్యర్థనలు స్వీకరించింది. ఇందులో అపోలో టైర్స్ సంస్థ స్పాన్సర్‌షిప్‌ను దక్కించుకుంది. స్పాన్సర్‌షిప్‌ కోసం కాన్వా, జెకె […]

ఆ కేసులో సోనూసూద్ సహా మాజీ క్రికెటర్లకు ఇడి సమన్లు

Sonu Sood

న్యూఢిల్లీ: నటుడు సోనూ సూద్ తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. మనీలాండరింగ్‌ కేసులో నటుడు సోనూసూద్‌తో (Sonu Sood) పాటు మరో ఇద్దరు మాజీ క్రికెటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప, 23న యువరాజ్ సింగ్, 24న సోనూసూద్‌లను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యావ్ లావాదేవీల్లో మనీలాండరింగ్‌కు సంబంధించి ఇడి ఊతప్పను ప్రశ్నించనుంది. ఈ కేసులో (Sonu Sood) […]

జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలి: ఆనం

Anam Ramanarayana Reddy comments jagan

అమరావతి: రాజకీయ అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎపి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అర్థరహితం అని అన్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గతంలో ఏం చెప్పారో జగన్ కు గుర్తు లేదని, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అని చంద్రబాబుపై విమర్శలకు మతి పోయిందని మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. […]