భర్తపై వేడి నూనె పోసిన భార్య

జోగులాంబ గద్వాల జిల్లా, మల్దకల్ మండలం, మల్లెందొడ్డి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై భార్య వేడి నూనె పోసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాల్లోకి వెళ్తే…వెంకటేష్, పద్మకు ఎనిమిదేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ముగ్గురు సతానం. భార్యాభర్తలు తరచూ గొడవ పడేవారు. ఈ నెల 11న నిద్రిస్తున్న భర్తపై పద్మను వేడి నూనె పోసింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే గద్వాల ఆస్పత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో కర్నూల్ ఆస్పత్రికి […]

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత భార్య

Maoist leader surrenders

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యురాలుగా సేవలందిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జీగా పని చేస్తున్నారు. గద్వాల ప్రాంతానికి చెందిన కల్పన ఏకైక మహిళా నాయకురాలుగా పని చేస్తున్నట్టు సమాచారం. కల్పన 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. శనివారం ఆమె లొంగుబాటు గురించి డిజిపి జితేందర్ వివరాలు వెల్లడిస్తారు. ఆమెతో పాటు మరికొందరు […]

గద్వాల లో పొలంలో బోల్తాపడిన స్కూల్ వ్యాన్

School van overturns in Gadwal

జోగులాంబ గద్వాల: ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌ అదుపుత‌ప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్ప గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాణ‌పాయం త‌ప్ప‌డంతో త‌ల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంమే కారణమని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆరగిద్ద జ్ఞాన సరస్వతి ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌గా గుర్తించారు. క్రేన్ సహాయంతో స్కూల్ […]