బీహార్‌లో నాలుగు లేన్ల మోకామా రోడ్డుకు కేంద్రం ఒకే

న్యూఢిల్లీ : బీహార్‌లో నాలుగు లేన్ల మోకామా ముంగేర్ రోడ్ నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని వెలువరించింది. బక్సర్ భగల్పూరు హై స్పీడ్ కారిడార్ పనులలో భాగమైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ 4,447.38 కోట్ల వ్యయం అవుతుందని అంచనావేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ 4 లేన్ రోడ్డు నిర్మాణానికి అనుమతిని ఇచ్చారు. ఈ ఏడాది చివరిలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. […]

వచ్చే నెల నుంచీ దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ

EC

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియపై ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఓ సమావేశంలో ఇందుకు సంబంధించిన సన్నాహాలను చర్చించారు. అన్ని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల(సిఈఓ)లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ప్రతిపాదనకు వారి ఆమోదం లభించింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇలాంటి ఓటర్ల జాబితా సవరణ నిర్వహించింది.ఇదే ప్రక్రియను అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత […]

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్

C. P. Radhakrishnan

న్యూఢిల్లీ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ గెలుపొందారు. మొత్తం 781 మంది పార్లమెంట్ సభ్యులకు గాను 767 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇది 98.2 శాతం ఓటర్ టర్నౌట్‌ను సూ చిస్తుంది. భారత రాష్ట్ర సమితి, బీజేడీ, శిరోమణి అకాళీదళ్ సభ్యులు ఓటు వేయలేదు. ఉప రాష్ట్రపతి అభ్యర్థులుగా ఎన్డీ యే తరఫున సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టి స్ బి సుదర్శన్ రెడ్డి […]