మణిపూర్ శాంతి సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాం: ప్రధాని మోడీ

చురాచంద్‌పూర్ : మణిపూర్‌ను పేరుకు తగ్గట్లుగానే శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలపాలనేదే తమ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2023 మే నెలలో తెగల మధ్య సంకుల సమరంతో అతలాకుతలం అయిన ఈ అత్యంత కీలకమైన ఈశాన్య రాష్ట్రంలో ప్రధాని మోడీ ఇక్కడ పర్యటించడం రెండేళ్లలో ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కుకీ తెగలు ఎక్కువగా ఉండే చురాచంద్‌పూర్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో తల్లడిల్లిన ఈ నేల సుభిక్షం […]

మధ్యప్రదేశ్ సిఎంకు తృటిలో తప్పిన ప్రమాదం

భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్‌కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కేందుకు సిద్ధమవుతున్న హాట్ ఎయిర్ బెలూన్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది మంటలను అదుపు చేయడంతో సీఎంకు ప్రమాదం తప్పింది. మంద్‌సౌర్ లోని గాంధీ నగర్ ఫారెస్ట్ రిట్రీట్ వద్ద ఈ సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి ఎయిర్ బెలూన్ ఎక్కడానికి సిద్ధమవుతుండగా బెలూన్ దిగువ భాగంలో మంటలు అంటుకున్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. […]

మన ప్రధానుల సంప్రదాయం ఇది కాదు.. మోడీపై విమర్శలు

వయనాడ్: జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వయనాడ్‌లో విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో ఘర్షణలు జరిగిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ అక్కడ పర్యటనకు వెళ్లడం దురదృష్టకరమన్నారు. భారత్‌లో ప్రధాన మంత్రుల సంప్రదాయం ఇది కాదంటూ విమర్శించారు. ప్రమాదాలు, విషాదాలు జరిగినప్పుడు ప్రధానులు వెంటనే అక్కడికి వెళ్తార్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి […]

మణిపుర్ పేరులోనే మణి ఉంది.. అది దేశానికే మణి వంటిది: మోడి

Modi visited Manipur

మణిపుర్: భారీ వర్షాల వల్ల హెలికాప్టర్ లో రావడం సాధ్యపడలేదని భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రోడ్డు మార్గంలో మణిపుర్ కు వచ్చానని అన్నారు. మణిపుర్ లో మోడీ పర్యటించారు. మణిపుర్ లో అల్లర్ల బాధితులను పరామర్శించారు. ఇంపాల్, చురాచంద్ పుర్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మణిపుర్ లో అల్లర్ల బాధిత కుటుంబాల చిన్నారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మణిపుర్ బహిరంగ సభలో మాట్లాడారు. రోడ్డు మార్గంలో వచ్చేటప్పుడు తనకు మణిపూర్ […]

దేశాభివృద్ధిలో మిజోరం యువత భాగస్వామ్యం కావాలి: ప్రధాని మోడీ

Mizoram youth participate national development

గ్యాంగ్‌టక్: దేశాభివృద్ధిలో మిజోరం భాగస్వామ్యం కీలకమని ప్రధాని మోడీ తెలిపారు. కొండమార్గంలో రైలు మార్గం కష్టతరంలో కూడుకున్నదని, సవాల్‌తో కూడిన నిర్మాణాలు అద్భుతమని కొనియాడారు. మిజోరంలో రూ.9 వేల కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. వర్చువల్‌గా అభివృద్ధి పనులను పిఎం మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ రైల్వే లైన్లు భారతీయ రైల్వే నెట్‌వర్క్‌తో అనుసంధానమవుతాయని, పర్యాటక రంగంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశం ఉందని తెలియజేశారు. ఏ […]

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత భార్య

Maoist leader surrenders

హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్‌జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యురాలుగా సేవలందిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇంచార్జీగా పని చేస్తున్నారు. గద్వాల ప్రాంతానికి చెందిన కల్పన ఏకైక మహిళా నాయకురాలుగా పని చేస్తున్నట్టు సమాచారం. కల్పన 106 కేసుల్లో నిందితురాలిగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. శనివారం ఆమె లొంగుబాటు గురించి డిజిపి జితేందర్ వివరాలు వెల్లడిస్తారు. ఆమెతో పాటు మరికొందరు […]

వినాయక చవితి వేడుకల్లో అపశృతి: 8 మంది మృతి

Hassan district Karnataka

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హసన్‌ జిల్లాలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మోసాలి హోసహళ్లి గ్రామ శివారులో గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో భక్తులపైకి కంటైనర్ దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 17 మందికి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు ఆరకళగుడి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ భువనేశ్ ను […]

గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి

20 మందికి గాయాలు కర్నాటకలోని హసన్ జిల్లాలో గణేశ్ నిమజ్జన ఊరేగింపులో విషాదం హసన్ : కర్నాటకలోని హసన్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జన ఊరేగింపులో ఒక ట్రక్కు ఢీకొట్టడంతో 8 మంది మృతి చెందగా, మరో 20మంది గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు. గణేశ్ చతుర్థి ఉత్సవాల ముగింపు రోజున మోసాలే హోసహళ్లి గ్రామంలో రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. […]

టేకాఫ్ సమయంలో ఊడిన చక్రం

గుజరాత్ లోని కాండ్లా విమానాశ్రయం నుంచి శుక్రవారం నాడు ముంబైకి వెళ్తున్న స్పేస్ జెట్ విమానం టేకాఫ్ సమయంలో ఒక చక్రం ఊడిపోయింది. అయితే, పైలెట్ లు విమానం ముంబై చేరిన తర్వాత సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేశారు. దీంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. విమానంలోని ఒక ప్రయాణీకుడు చక్రం ఊడిపోతున్న వీడియోను చిత్రీ కరించాడు. విమానం చక్రం పడిపోయిందని, అతడు పదేపదే చెప్పడం వీడియోలో విన్పించింది. క్యూ 400 టర్బోప్రాప్ విమానం టేకాఫ్ అయిన […]

టేకాఫ్ సమయంలో ఊడిన విమానం టైర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Spicejet

ముంబై: స్పైస్‌జెట్ (Spicejet) సంస్థకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. గుజరాత్‌లోని కండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న క్యూ400 స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన సమయంలో టైర్ ఒకటి ఊడిపోయింది. అయితే అప్పటికీ ప్రయాణం కొనసాగించి ముంబై విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. విమాన ప్రమాదానికి గురైన సమయంలో అందులో 75 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన […]