ఆపరేషన్ సింధూర్‌లో మసూద్ కుటుంబం ముక్కలై పోయింది

గత మే నెలలో భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఉగ్రవాద నాయకుడు మసూద్ అజర్ కుటుంబంలో పిల్లాపాపలతో సహా కుటుంబ సభ్యులంతా మరణించారని తొలిసారిగా జైషే మొహమ్మద్ అంగీకరించింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో జైషే అగ్రకమాండర్ ఇలియాస్ కశ్మీరీ మాట్లాడుతూ ఇటీవల మనకు తీవ్ర నష్టం వాటిల్లందని వ్యాఖ్యానించారు. మే 7న బహవల్ పూర్ లోని జైషే ప్రధాన కార్యాలయం, జామియా మసీదు సుభాన్ అల్లాపై జరిగిన దాడిలో మసూద్ అజర్ కుటుంబంలోని పిల్లలతో […]

దారుణం.. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను తోసి చంపిన సవితి తల్లి

బెంగళూరు: కర్ణాటకలోని బీదర్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. మూడో అంతస్తు నుంచి 6 ఏళ్ల బాలికను సవిత తల్లి కిందకు తోసి హత్య చేసిిన దిగ్భ్రాంతికరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిసిటివి ఫుటేజ్ ఆధారంగా సవితి తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన ఆగస్టు 27న బీదర్ పట్టణంలోని ఆదర్శ్ కాలనీలో జరిగింది. 6 సంవత్సరాల బాలిక సాన్వి మూడవ అంతస్తు నుండి అకస్మాత్తుగా కింద పడి […]

వక్ఫ్‌పై పాక్షిక స్టే

న్యూఢిల్లీ : అత్యంత కీలకమైన వక్ఫ్ సవరణల చ ట్టం 2025పై సుప్రీంకోర్టు సో మవారం తమ ఆ దేశాలతో కూడిన రూలింగ్ వెలువరించింది. చ ట్టంలోని కొన్ని ప్రధాన నిబంధనలపై స్టే విధించింది. అయితే మొత్తం చట్టాన్ని నిలిపివేయాలనే వాదనను తోసిపుచ్చింది. ప్రత్యేకించి వక్ఫ్ ఆస్తుల విషయంలో రూలింగ్ ప్రధానమైంది. దీని మేరకు ఆస్తులకు సంబంధించి నియుక్త అధికారి ఆస్తులపై నివేదిక ఇచ్చేంత వరకూ ఆయా ఆ స్తులు వక్ఫ్ ఆస్తులుగా చలామణిలోకి రావని తే […]

చట్టవిరుద్ధమైతే సర్ రద్దు చేస్తాం

న్యూఢిల్లీ : బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్‌ఐఆర్’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను సో మవారం హెచ్చరించింది. అయితే రా జ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో సరైన నిబంధనలను పాటించిందని భావిస్తున్నట్టు పేర్కొంది. బీ హార్‌లో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా సర్వే కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌జోయ్ […]

నేడు భారత్‌ అమెరికా వాణిజ్య చర్చలు

న్యూఢిల్లీ : రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంగా భారత్ ఎగుమతులపై ట్రంప్ 50 శాతం సుంకాల భారం విధించడం తో ఇరు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చల్లో తలెత్తిన అనిశ్చితిని తొలగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నా యి. ఇందులో భాగంగా సోమవారం రాత్రి అ మెరికా ప్రతినిధి, ట్రంప్ సహాయకుడు ,దక్షిణ మధ్య ఆసియాకు అసిస్టెంట్ యూఎస్ ట్రేడ్ ప్రతినిధి బ్రెన్డన్ లించ్ భారత్‌కు […]

కేరళలో ప్రాణాంతక అమీబా.. మెదడు కణాలు తినేసే రకం.. 18మంది మృతి

తిరువనంతపురం ః కేరళలో మనిషి మెదడు కణాలను తినేసే ప్రాణాంతక సూక్ష్మజీవి అమీబా విరుచుకుపడింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ అమీబా బాధిత కేసులు 67 వరకూ అధికారికంగా వెలుగులోకి వచ్చాయి, ఈ ఏడాది ఇప్పటికే 18 మంది వరకూ ఈ సూక్ష్మజీవుల కాటుతో మృతి చెందారు. సవరించిన లెక్కలను ఇప్పుడు సోమవారం అధికారికంగా మీడియాకు వెలువరించారు. సంబంధిత కేసులు పెరిగిపోతూ ఉండటంతో పరిస్థితిపై రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జి స్పందించారు. అత్యవసర రీతిలో మంచినీటి […]

వంతరాపై సుప్రీం కోర్టు క్లీన్‌చిట్

Supreme Court

న్యూఢిల్లీ : గుజరాత్ లోని జామ్‌నగర్‌లో జులాజికల్ రిస్కు, రీహేబిలిటేషన్ (వన్యమృగ ప్రమాద నివారణ, పునరావాస ) కేంద్రం వంతరాపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం క్లీన్‌చిట్ ఇచ్చినట్టు సుప్రీం కోర్టు సోమవారం వెల్లడించింది. ఈ కేంద్రానికి ఏనుగుల తరలింపును సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ పిబి వరాలేలతో కూడిన ధర్మాసనం విచారించింది. వంతరాపై ప్రత్యేక దర్యాప్తు బృందం ఇచ్చిన నివేదికను పరిశీలించిన అనంతరం ఈ విషయంపై […]

కోటి రూపాయల రివార్డున్న మావో కమాండర్ మృతి

రాంచీ: జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో సోమవారం ఉదయం భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో కోటి రూపాయల రివార్డు ఉన్న సహదేవ్ సోరెన్ అనే మావోయిస్టు సహా మొత్తం ముగ్గురు నక్సలైట్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. గోర్‌హర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పంతిత్రి అడవుల్లో ఉదయం ఆరు గంటల నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సహదేశ్ అలియాస్ ప్రవేశ్ నిషిద్ధ సిపిఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ సభ్యుడు. ఆయనపై కోటి రూపాయల […]

ఢిల్లీ ఎర్రకోటకు కాలుష్య నష్టం

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు నాణ్యత క్షీణిస్తుండడంతో ప్రసిద్ధ ఎర్రకోటకు వేగంగా నష్టం కలుగుతోందని ఇటీవలి అధ్యయనం కనుగొంది. 17వ శతాబ్దపు స్మారక చిహ్నం ఎర్ర ఇసుకరాయి గోడలపై నల్లటి కాలుష్య కారకాలు ఏర్పడుతున్నాయని, ఇది దాని నిర్మాణ, సౌందర్య సమగ్రతను దెబ్బతీసేదిగా ఉందని ఇండోఇటాలియన్ నూతన అధ్యయనం పేర్కొంది. చారిత్రక స్మారకం అయిన ఎర్రకోటను 16391648 మధ్య కాలంలో మొగలు చక్రవర్తి షాజహాన్ కట్టించారు. నల్లటి కాలుష్య కారకాలలో జిప్సమ్, బాస్సనైట్, వెడ్డెలైట్, […]

చట్ట విరుద్ధంగా ఉంటే.. ‘సర్’ను రద్దు చేస్తాం: సుప్రీం హెచ్చరిక

governors duties begins

రాజ్యాంగబద్ధ సంస్థ నిబంధనలు పాటించిందనే భావిస్తున్నాం 7న తుది వాదనలు వింటాం, ఆ తర్వాత తీర్పు దేశ వ్యాప్తంగా నిలుపదల చేయలేం బీహార్ ఓటరు జాబితా సమగ్ర సవరణపై సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ : బీహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు ఎన్నికల కమిషన్ అనుసరించిన పద్ధతిలో ఏదైనా చట్టవిరుద్ధంగా కనిపిస్తే మొత్తం ‘ఎస్‌ఐఆర్’ను రద్దు చేస్తామని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్‌ను సోమవారం హెచ్చరించింది. అయితే రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం ఎన్నికల […]