ఫేవరెట్‌గా బంగ్లాదేశ్.. నేడు హాంకాంగ్‌తో పోరు

అబుదాబి: ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ గురువారం తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. గ్రూప్‌బిలో భాగంగా అబుదాబిలో జరిగే ఈ మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీకి శ్రీకారం చుట్టాలనే పట్టుదలతో బంగ్లా కనిపిస్తోంది. తొలి మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో ఓడిన హాంకాంగ్‌కు ఈ పోరు సవాల్‌గా మారింది. బలమైన బంగ్లాను ఓడించడం హాంకాంగ్‌కు చాలా కష్టంతో కూడుకున్న అంశంగా చెప్పొచ్చు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బంగ్లా సమతూకంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని […]

వైరల్‌గా మారిన బిసిసిఐ స్పెషల్ వీడియో

ముంబై: భారత క్రికెట్ బృందం గురించి బిసిసిఐ సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. యుఎఇ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టి20 టోర్నమెంట్‌లో టీమిండియా బుధవారం తొలి మ్యాచ్‌ను ఆడిన విషయం తెలిసిందే. యుఎఇతో భారత్ ఈ మ్యాచ్‌లో తలపడింది. ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు ఉన్న వీడియోను భారత క్రికెట్ బోర్డు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, […]

ప్రపంచ టెన్నిస్‌లో అల్కరాజ్ హవా

మన తెలంగాణ/ క్రీడా విభాగం: అంతర్జాతీయ పురుషుల టెన్నిస్‌లో స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాజ్ హవా నడుస్తోంది. తాజాగా జరిగిన యుఎస్ ఓపెన్‌లో అల్కరాజ్ ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఈ సీజన్‌లో అల్కరాజ్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ కావడం విశేషం. ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్‌లలో కార్లొస్ విజేతగా నిలిచాడు. యుఎస్ ఓపెన్ టైటిల్‌లో తిరిగి పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ప్రపంచ టెన్నిస్‌లో నాదల్ తర్వాత అంతటి ప్రతిభ […]

ఆసియా కప్ 2025: 4.3 ఓవర్లలోనే భారత్ విజయం

దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన రెండవ మ్యాచ్‌లో యుఎఇపై టీమిండియా ఘన విజయం సాధించింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. కేవలం 4.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి మ్యాచ్ ను ముగించేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(30), శుభ్ మన్ గిల్(20 నాటౌట్)లు రాణించారు. దీంతో ఆసియా కప్ లో భారత్ బోణి కొట్టింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ […]

ఆసియా కప్ 2025: మరికాసేపట్లో భారత్-యుఎఇ పోరు..

దుబాయ్: ఆసియా కప్ 2025లో భాగంగా రెండవ మ్యాచ్‌లో టీమిండియా, (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)యుఎఇ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈరోజు(సెప్టెంబర్ 10, బుధవారం) రాత్రి 8 గంటలకు భారత్-యుఎఇ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. గ్రూప్‌ ఏలో జరగనున్న తొలి మ్యాచ్‌ ఇదే.  2016 తర్వాత తొలిసారిగా ఈ ఫార్మాట్‌లో ఇరుజట్లు పోటీ పడుతున్నాయి. 2022లో టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకోలేకపోయినా.. 2023లో వన్డే ఫార్మాట్‌లో […]

పక్షవాతం వచ్చింది.. ఆ బాధ మాటల్లో చెప్పలేను: శ్రేయస్

Shreyas Iyer

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ప్రదర్శనే చేస్తున్నప్పటికీ.. టీం ఇండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) ఆసియాకప్-2025లో ఆడే అవకాశం రాలేదు. ఈ నేపథ్యంలో సెలక్టర్లుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే శ్రేయస్‌కు ఊరటనిస్తూ.. త్వరలో ఆస్ట్రేలియా ఎతో తలపడే ఇండియా ఎ జట్టుకు అతన్ని కెప్టెన్‌గా నియమించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేయస్ తనకు జరిగిన ఓ బాధాకరమైన సంఘటన గురించి పంచుకున్నాడు. 2023లో తనకు వెన్నునొప్పి సమస్య వచ్చిందని.. […]

బుమ్రాను ఆడిస్తే ఊరుకొనేదిలేదు.. మాజీ క్రికెటర్ వార్నింగ్

Ajay Jadeja

ఆసియాకప్-2025లో టీం ఇండియా తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది. తొలి పోరులో పసికూన యుఎఇతో భారత్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌లో తలపడే జట్టు కూర్పుపై కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లు కసరత్తు చేస్తున్నారు. ఎవరిని ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఈ మ్యాచ్‌లో ఆడిస్తే ఊరుకొనేది లేదని టీం ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా (Ajay Jadeja) హెచ్చరించారు. బుమ్రాను జాగ్రత్తగా […]

టి-20 సిరీస్‌కి ముందు సౌతాఫ్రికాకు బిగ్ షాక్

David Miller

మూడు వన్డేలు, మూడు టి-20ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇప్పటికే ఆతిథ్య జట్టుతో జరిగిన వన్డే సిరీస్‌ని సఫారీ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇవాళ్టి (సెప్టెంబర్ 10) నుంచి ఇరు జట్ల మధ్య టి-20 సిరీస్ ప్రారంభంకానుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు సౌతాఫ్రికా జట్టకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా కీలక ఆటగాడు డేవిడ్ మిల్లర్ (David Miller) ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవల […]

వివాదాస్పద కేసులో.. పృథ్వీషాకు జరిమానా విధించిన కోర్టు

Prithvi Shaw

ముంబై: టీం ఇండియా యువ క్రికెటర్ పృథ్వీషాకు (Prithvi Shaw) ముంబైలోని దిండోషి సెషన్స్‌ కోర్టు జరిమానా విధించింది. యూట్యూబర్ సప్నాగిల్‌.. పృథ్వీషా మధ్య జరిగిన వివాదం కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. అయితే ఈ కేసులో సప్నా వేసిన పిటిషన్‌కు సమాధానం దాఖలు చేయడంలో విఫలమైనందున పృథ్వీషాను రూ.100 జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. షా తరఫు న్యాయవాదికి జూన్ 13నే చివరి అవకాశం కల్పించారు. కానీ, ఇప్పటివరకూ అతడి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. […]

హాంకాంగ్ పై ఆఫ్ఘాన్ భారీ విజయం

Afghanistan vs Hong Kong

అబుదాబి: ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై ఆప్ఘనిస్థాన్ ఘన విజయం సాధించింది. 94 పరుగులు తేడాతో ఆప్ఘాన్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘాన్ 189 పరుగుల లక్షన్ని హాంకాంగ్ ముందు ఉంచింది. హాంకాంగ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో ఆఫ్ఘాన్ విజయ దుందుభి మోగించింది. ఆప్ఘాన్ బ్యాట్స్‌మెన్లలో సెదికుల్లా అతల్ 73 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అజమతుల్లా 53 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. నబీ […]