పాలకుల అవినీతే అసలు కారణం

focusing conditions Nepal

నేపాల్‌లో గత మూడు రోజుల క్రితం జరిగిన ఘటనలు మొత్తం ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి. శాంతియుత ప్రదర్శన హింసాయుతంగా మారడం, కాల్పులు జరగడం, మరోసటి రోజు అది ఖాట్మండులోని అతి ముఖ్యమైన భవనాలు, వ్యాపార, మీడియా సంస్థలు సైతం అగ్గికి ఆహుతి అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది ఆందోళన కలిగించింది. నేపాల్‌లో చెలరేగిన హింస యువతరం, కోపానికి, అసంతృప్తి నుంచి పుట్టిందని అందరం భావిస్తున్నాం. అయితే ఇది పైకి కనిపించే అంశమే. యువతరం తాము ఆవేశాన్ని ఒక నిరసన ప్రదర్శన […]

రోడ్లు బాగుంటేనే ప్రాణాలకు భద్రత

కర్ణాటక లోని మంగళూరు సమీపాన మంగళవారం (9.11.25) ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 66 పై 44 ఏళ్ల మహిళ అకస్మాత్తుగా గుంతలో పడిపోగా, అదే సమయంలో స్పీడుగా వచ్చిన ట్రక్కు చక్రాలు ఆమె ప్రాణాలను బలిగొన్నాయి. రోడ్ల భద్రత ఏ విధంగా ఉందో ఈ సంఘటన చెబుతుంది. 2019 23 మధ్యకాలంలో కేవలం రోడ్లపై గుంతల కారణంగానే టూవీలర్లు మరణాలసంఖ్య 9109 వరకు ఉన్నట్టు రోడ్లు, రవాణా మంత్రిత్వశాఖ వెల్లడించడం గమనార్హం. ఉగ్రవాదుల […]

ఇప్పటికీ స్వేచ్ఛాయుత వ్యూహమే!

భారత విదేశాంగ విధానం గురించి ఎస్‌సిఒ తియాన్‌జిన్ సమావేశాల తర్వాత పలు విధాలైన వ్యాఖ్యానాలు వెలువడుతున్నాయి. వాటిలో అన్నింటి కన్న ఎక్కువగా కనిపిస్తున్న అభిప్రాయం, భారతదేశం ఇక అమెరికా కూటమికి పూర్తిగా దూరమైపోయి చైనా, రష్యా కూటమిలో చేరిపోవటం ఇంకా జరగకున్నా ఆ దిశలో ప్రయాణం మొదలుపెట్టిందినేది.. ఈ అభిప్రాయానికి పరాకాష్ట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వినిపించింది. తామిక ఇండియాను రష్యాను కూడా చైనాకు కోల్పోయినట్లు తోస్తున్నదని దీనమైన మొహంతో అన్నారాయన. ఆ ముగ్గురి మైత్రి […]

వీసాలపై వెయ్యికళ్ల నిఘా

అమెరికాలోని భారతీయ విద్యార్థుల కదలికలపై నిఘా పెంచిన సంగతి తెలిసిందే. భారత దేశంనుంచి విద్యార్థులు నిజంగా చదువులకోసం వచ్చారా లేదా చట్ట వ్యతిరేకంగా ఏవైనా ఉద్యోగాలు చేస్తున్నారా? సరైన అధికారిక పత్రాలతో వచ్చారా? వాళ్ల బ్యాంకు లావాదేవీలు ఎలా ఉన్నాయి? తదితర అంశాలపై తీవ్రంగా నిఘా కొనసాగుతోంది. అదేవిధంగా ఇప్పుడు తాజాగా హెచ్1బి, ఎఫ్1 వీసాదారుల అనధికారిక సంపాదనపైనా నిఘా పెడుతున్నారు. ఈ మేరకు పన్ను చెల్లింపుదారుల సమాచారాన్ని ఇమిగ్రేషన్ అధికారులకు ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్) […]

విద్య, వైద్యం జాతీయీకరణ జరగాలి

విద్య-, వైద్య రంగాలలో నెలకొన్న అసమానతలు తొలగించకుండా సామాజిక,-ఆర్థిక-, రాజకీయ -సాంస్కృతిక రంగాలలో సమానత్వం సాధించడం అసాధ్యం. ప్రజల మధ్య సోదర భావం, జాతీయ ఐక్యత, సమైక్యత సాధించాలంటే విద్య,-వైద్య రంగాలను ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తూ నాణ్యత ప్రమాణాలు పాటించేలా తగు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ విద్య, -వైద్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కలిగించేందుకు తగిన కృషి జరపాలి. అంతర్గత వలసాధిపత్యాన్ని, వనరుల దోపిడీ, తరలింపును నిరసిస్తూ తెలంగాణ ప్రజలు ప్రజాస్వామిక పద్ధతుల్లో సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ […]

డాలర్‌కు ప్రత్యామ్నాయం తక్షణావసరం

డీడాలరైజేషన్ అంటే ప్రపంచ దేశాలు అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థికం, కరెన్సీ నిల్వలలో అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకుని, బదులుగా ప్రత్యామ్నాయ కరెన్సీలను ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకునే ప్రక్రియ. ఇది దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక కార్యకలాపాలకు వర్తిస్తుంది. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో అనేక దేశాలు వివిధ కారణాల వల్ల డీడాలరైజేషన్‌ను అనుసరిస్తున్నాయి. వాస్తవానికి, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్ వుడ్స్ ఒప్పందం ద్వారా చారిత్రక, ఆర్థిక నిర్మాణాత్మక అంశాల కారణంగా అంతర్జాతీయ వాణిజ్యానికి వినిమయ మాధ్యమంగా డాలర్‌ను […]

‘ఆరావళి’కి పొంచి ఉన్న పెనుముప్పు

Aravali Park

పులులు, సింహాలు, చిరుతలు వంటి అన్యదేశ, ఆకర్షణీయమైన జాతులను కంచె వేసిన ఆవరణలలోకి ప్రవేశపెట్టాల నే ప్రణాళిక ఒక ప్రధాన వివాదాస్పద అంశం అని హెచ్చరిస్తున్నారు. 10,000 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కంచె వేయడం వినాశకరమైనదని పరిరక్షణ నిపుణులు వాదిస్తున్నారు. ఇది హర్యా నాలోని కీలకమైన, చివరిగా మిగిలి ఉన్న క్రియాత్మక వన్యప్రాణుల కారిడార్‌ను ముక్కలు చేస్తుంది. ఇది మంగర్ బని, అసోలా అభయారణ్యాలకు అనుసంధా నిస్తుంది. చిరుతలు, చారల హైనాలు, సాంబార్ జింకలు, తేనె బ్యాడ్జర్‌ల […]

మరో బంగ్లాదేశ్‌గా నేపాల్

Nepal crisis reason

నేపాల్ మరో బంగ్లాదేశ్‌గా మారుతుందా? సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ యువత చేపట్టిన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం దిగివచ్చి నిషేధాన్ని ఎత్తివేసినా పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఈ నిరసనలు కేవలం సోషల్ మీడియాపై జెన్ జెడ్ యువత చేస్తున్న ఆందోళన మాత్రమే కాదని ప్రభుత్వవర్గాల్లోని అవినీతికి ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత కూడా కారణమని చెబుతున్నారు.తాజాగా మంగళవారం ఉదయం కూడా నేపాల్ రాజధాని (Nepal crisis reason) ఖాట్మండులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖాట్మండులో అధ్యక్షుడు, […]

ఆ‘పన్ను’లకు ప్రయోజనమెంత?

GST books in telugu pdf

సాధారణంగా పండుగల వేళ వ్యాపారాలు డిస్కౌంట్ సేల్ ప్రకటిస్తుంటారు. ఈసారి ఈ కార్యం కేంద్ర ప్రభుత్వమే చేపట్టింది. జిఎస్‌టి స్లాబ్ ల సవరణలపై కేంద్ర వస్తువుల, సేవల పన్నుల మండలి సిఫారసులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాలుగు రోజుల క్రితం ప్రకటించారు. దసరా నవరాత్రుల తొలి రోజు అయిన ఈ నెల 22వ తేదీనుండి అవి అమలులోకి వస్తాయని ఆమె తెలిపారు. ఈ తగ్గింపుతో సర్వత్రా హర్షంతో కూడిన సందడి మొదలైంది. వాస్తవానికి ప్రభుత్వాలు ప్రజలకు […]

బరువెక్కుతున్న బాలభారతం

Heavy weight boys

దేశంలో సగం మంది పిల్లలు బక్కపలచగా, మరో సగంమంది భారీ ఊబకాయంతో నాణేనికి బొమ్మాబొరుసు లాగా బాలభారతం అఘోరిస్తోంది. రక్తహీనత, పౌష్టికాహారలోపం, దృష్టి లోపాలు, న్యూరో సైకిక్ సమస్యలు అన్ని అరిష్టాలు ప్రపంచ దేశాల్లో మనం ముందున్నాం. పిల్లల్లో ఎదుగుదల నిలిచిపోయి గిడసబారినవారు 36%, తగినంత బరువులేనివారు 17%, ఏ పని స్వతంత్రంగా చేసుకోలేని వారు నిరర్థక జీవితం అనుభవిస్తున్నవారు 6% ఉన్నారు. 60% పిల్లలు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు లేకపోవడం, పౌష్టికాహరం లేకపోవడం, అపరిశుభ్రత వాతావరణం […]