వలసదారులకు నో ఎంట్రీ

అభివృద్ధి చెందిన, అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థలు నెలకొని ఉన్న కొన్ని దేశాలు ప్రస్తుతం అలజడులకు లోనవుతున్నాయి. అక్రమంగానో, సక్రమంగానో తమ దేశాల్లోకి ప్రవేశించి, తిష్ఠవేసుకుని కూర్చున్న వలసదారులవల్ల తమకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అడుగంటడమే కాకుండా, శాంతిభద్రతల సమస్య తలెత్తుతోందని, తమ జాతీయ, సాంస్కృతిక విలువలు తరిగిపోతున్నాయని ఆయా దేశస్థులు సాగిస్తున్న ఆందోళనలు అర్థం చేసుకోదగినవే. ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరించే అమెరికాలో స్వయంగా అధ్యక్షుడే వలసలకు వ్యతిరేకంగా ఉక్కుపాదం మోపుతున్నారు. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ […]

మోడీ పర్యటనతో మణిపూర్ గాయం మానేనా?

Modi visited Manipur

ఒకప్పుడు భారతదేశ ఈశాన్య సరిహద్దుల్లో జాతు గుర్తింపుల శక్తివంతమైన సముదాయంగాఉన్న మణిపూర్, ఇప్పుడు శాశ్వత విభజనకు చిహ్నంగా మారింది. 2023 మే 3న లోయలో నివసించే మెయితీ మెజారిటీ కమ్యూనిటీ, కొండ ఆధారిత కుకి-జో తెగల మధ్య జాతిపరమైన హింస చెలరేగినప్పటి నుంచీ రాష్ట్రంలో 258 మందికి పైగా మరణించారు. 60,000 మంది నిరాశ్రయులయ్యారు. జాతిపరంగా, అనధికారికంగా స్పష్టమైన విభజనను చూసింది. రెండున్నర సంవత్సరాల తర్వాత, అంటే.. ఘర్షణలు ప్రారంభమైన 865 రోజుల తర్వాత, 2025 సెప్టెంబర్ […]

జిఎస్‌టి కొత్త శ్లాబులు.. కమలానికి కలిసొచ్చేనా!

జిఎస్‌టి శ్లాబుల మార్పు అంశాన్ని బలమైన రాజకీయ అస్త్రంగా మల్చుకొనేందుకు బిజెపి సిద్ధమవుతోంది. ఇప్పటికే అమలులోనున్న జిఎస్‌టి విధానంతో ప్రధాని నరేంద్ర మోడీ కేవలం కార్పొరేట్ శక్తులకే మేలు చేశారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ వచ్చారు. వాటిని ఎదుర్కొనేందుకు తాజాగా జిఎస్‌టి శ్లాబుల మార్పుతో తాము పేద, సామాన్య, మధ్య తరగతి పక్షమని చెప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంతగా మిడిల్ క్లాస్‌కు ప్రధాని మేలు చేశారని బిజెపి అంటోంది. మోడీ వల్లనే […]

ఓజోన్ రక్షతి రక్షితః

ఓజోన్ అనేది ఆక్సిజన్ ప్రత్యేక రూపం. ఇది మూడు ఆక్సిజన్ పరమాణువులతో ఏర్పడిన ప్రత్యేకమైన వాసన కలిగిన రంగులేని వాయువు. భూవాతావరణంలో స్ట్రాటోస్పియర్ పొరలో ఉండే ఓజోన్ వాయువు పొర అతినీల లోహిత కిరణాలను శోషించుకొని భూమిపైగల సమస్త జీవరాశిని కాపాడుతుంది. అందుకే ఓజోన్ పొరను భూమి కవచం లేదా భూమి గొడుగు అంటారు. ఇది నీటిలోని సూక్ష్మక్రిములను చంపడానికి, గాలిని శుభ్రపరచడానికి, ఆహార పదార్థాల రంగును పోగొట్టడానికి, ఆహార నిల్వలలో బ్యాక్టీరియా పెరుగకుండా కూడా ఉపయోగపడుతుంది. […]

మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?

BRS Political drama

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు శుక్రవారంనాడు ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సిగ్గుపడాలి అన్నారు ఆ ట్వీట్లో. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణ మొదలైన అంశాలలో జరుగుతున్న అవకతవకల మీద ఓట్ చోరీ అని సాగిస్తున్న ఉద్యమం కంటే కూడా ఎంఎల్‌ఎల చోరీ దారుణమైన నేరమని కెటి రామారావు అభిప్రాయపడ్డారు. ఇదంతా ట్వీట్‌లోనే, […]

అవినీతి పాలకులకు ఇక చుక్కలే!

ఇటీవల కాలంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన పరిణామాలు యావత్ ప్రపంచాన్ని హడల్ ఎత్తించాయి. ఈ సంఘటనలతో దాదాపు అన్ని దేశాల అధినేతలు, పాలకులు, ప్రభుత్వాలు చాలా గుణపాఠాలు నేర్చుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు చాలా ఓపిక, సహనం కలిగి ఉంటారు. ఓటు ద్వారా, సోషల్ మీడియా ద్వారా, పత్రికలు ద్వారా, భావప్రకటన ద్వారా తమతమ అభిప్రాయాలను వెలిబుచ్చుతూ ఉంటారు. ఇవేమీ పట్టించుకోకుండా, అధికారం చేతిలో ఉంది అని మూర్ఖంగా ముందుకుపోయే ప్రభుత్వాలకు ప్రజలు […]

మోడీ పాలనలో భారత్ ‘ఒంటరి’

నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత విదేశాంగ విధానాన్ని ఒక కొత్త దిశలో నడిపించాలని ప్రకటించారు. ‘నెయిబర్ హుడ్ ఫస్ట్’ నుంచి ‘ఆక్ట్ ఈస్ట్’ వరకు విశ్వగురుగా భారతదేశాన్ని చూపించాలని ఆయన ఆకాంక్ష. కానీ, గత 11 సంవత్సరాలలో ఈ విధానం ఎన్నో లోపాలను, వైఫల్యాలను చవిచూసింది. నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఈ విధానాన్ని విమర్శిస్తూ, అది దేశ భద్రతకు, అంతర్జాతీయ సంబంధాలకు హాని కలిగించిందని చెబుతున్నారు. ముఖ్యంగా, పొరుగు దేశాలతో సంబంధాలు, […]

వెనెజువెలాపై యుద్ధ మేఘాలు

underway invade Venezuela

ప్రపంచ దేశాల బలహీనతలను ఆసరా చేసుకుని వాటిని పాదాక్రాంతం చేయడం, అక్కడ ఉన్న సహజ వనరులను కొల్లగొట్టడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుత అజెండాగా మారింది. గత కొన్నాళ్లుగా జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తే నియంతగా ట్రంప్ దురాక్రమణ చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టమవుతోంది. పనామా కాలువ, గ్రీన్‌ల్యాండ్, ఉక్రెయిన్ తమకు దాసోహం అయ్యేలా ట్రంప్ ఎత్తుగడలు ఫలింపచేసుకున్నారు. ఆయా దేశాల్లో ఉండే, రేర్ మినరల్స్ (అరుదైన ఖనిజాలు), చమురు, గ్యాస్ నిక్షేపాలను కొల్లగొట్టే ప్రణాళికలను రూపొందించుకున్నారు. ఇప్పుడు తాజాగా […]

సుస్థిర విధానాలతోనే సాగు బాగు

agricultural products severe farmers

భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా పురోగమిస్తూ త్వరలోనే ప్రపంచ 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగనుండటం సంతోషకరమే. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై 50% దిగుమతి సుంకాలు విధించడం వల్ల మన జిడిపి 0.3 శాతం తగ్గనున్నట్లు, జిఎస్‌టి సంస్కరణలు, మార్కెట్ల విస్తరణతో ఆ నష్టాల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల వల్ల మన ఎగుమతులపై తీవ్ర ప్రభావంపడి వేలాది మంది జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ సుంకాలు అమెరికాపై […]

ఆదివాసుల హక్కులకు ఏదీ రక్షణ?

Today World Indigenous Rights Day

ఆదివాసుల జీవన విధానం పర్యావరణం, అడవులు, అక్కడ ఉండే సహజ వనరులు మొదలైన వాటితో ముడిపడి ఉన్నది. కానీ నవీన సమాజం వారి హక్కుల నుండి దూరం చేసే సంక్షోభం నుండి వీరిని రక్షించాల్సిన అనివార్యత ఎంతైనా ఉంది. ఇప్పటికే 1994లో ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. కానీ ఆదిమ జనుల హక్కులు, వాటి రక్షణే ధ్యేయంగా, ఆదివాసీల హక్కుల రక్షణకు, వారి అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ ఐక్యరాజ్య సమితి స్థానిక ప్రజలపై […]