ఆయేషా మీరా హత్య కేసులో కీలక మలుపు
2007లో విజయవాడలో జరిగిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సుదీర్ఘంగా పలుమార్లు పోలీసులతో పాటు సిబిఐ కూడా విచారించాయి. నిర్దోషిగా విడుదలైన సత్యంబాబుపై 376, 302 సెక్షన్లు నమోదుకు సంబంధించి అభ్యంతరాలు ఉంటే తెలపాలని సిబిఐ కోర్టు అయేషా తల్లిదండ్రులు బాషా, సంషేద బేగంకు శుక్రవారం నోటీసులు ఇచ్చింది. సిబిఐ దర్యాప్తు పూర్తి చేసి నివేదికను కోర్టుకు సమర్పించడంతో ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. […]