జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలి: ఆనం
అమరావతి: రాజకీయ అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తి మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎపి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతిపై జగన్ వ్యాఖ్యలు అర్థరహితం అని అన్నారు. ఈ సందర్భంగా ఆనం మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గతంలో ఏం చెప్పారో జగన్ కు గుర్తు లేదని, దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం అని చంద్రబాబుపై విమర్శలకు మతి పోయిందని మండిపడ్డారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని సూచించారు. […]