నేపాల్ హింసాకాండలో 51కి చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌లో ఇటీవలి జెన్ జడ్ ఉద్యమంలో చెలరేగిన హింసాకాండలో మృతుల సంఖ్య 51కి చేరుకుంది. మృతులలో కొందరు మంటలలో చిక్కుకుని సజీవ దహనం చెందారు. ఉత్తర ప్రదేశ్‌లోని గజియాబాద్ నివాసి 57 సంవత్సరాల మహిళ రాజేష్ గోలా ఖాట్మండులోని హ్యాత్ రిజెన్సీ హోటల్‌లో బస చేసిన దశలో మృతి చెందారు.ఆమె వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ మంది యాత్రికులు ఉంటున్న ఈ హోటల్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. బయటపడే ఆమె నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకే […]

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కీ

Sushila Karki

ఖాట్మండూ: సోషల్‌మీడియా బ్యాన్, అవినీతి పాలన తదితర కారణాలతో నేపాల్ భగ్గుమన్న విషయం తెలిసిందే. జెన్‌-జెడ్ యువత ఆందోళనలతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్లింది. ఈ అల్లర్ల నేపథ్యంలో కెపి శర్మ ఓలీ.. నేపాల్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆ దేశ పార్లమెంట్‌ రద్దైంది. తర్వాత ప్రధానిగా మాజీ చీఫ్‌ జస్టిస్ సుశీల కర్కీని (Sushila Karki) తాత్కాలిక ప్రధానిగా ఉద్యమకారులు ఎన్నుకున్నారు. సుశీల కర్కీ(72) తొలుత ఉపాధ్యాయురాలిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత […]

డల్లాస్ లో భారత సంతతి వ్యక్తి తల నరికి హత్య

Indian-origin man beheaded

న్యూయార్క్: అమెరికాలోని డల్లాస్‌లో భారత సంతతి వ్యక్తి హత్యకు గురయ్యాడు. చంద్రమౌళి నాగమల్లయ్య అనే భారత సంతతి వ్యక్తి డల్లాస్ నగరంలో మోటల్ నిర్వహిస్తున్నాడు. మోటల్‌లో పని చేసే జోర్డాన్ కాబోస్ మార్టినెజ్ అనే ఉద్యోగి కత్తితో చంద్రమౌళి తల నరికి చంపాడు. చంద్రమౌళిని చంపుతున్నప్పుడు భార్య, పిల్లలు అక్కడే ఉన్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జోర్డాన్ కాబోస్ మార్టినెజ్ ను అరెస్టు చేసి […]

అంతుచిక్కని చార్లీ కిర్క్ హంతకుడు

ఒరెమ్(యుఎస్): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ పార్టీ క్రియాశీలక కార్యకర్త చార్లీ కిర్క్(31) హత్యకు గురయ్యారు. అమెరికా ఇప్పటికే నిండిపోయింది, ఇండియా నుంచి వచ్చే వారికి వీసాలు ఇవ్వనవసరం లేదని, స్వదేశీ ప్రజలకే పాధాన్యం ఇవ్వాలని ఆయన సెప్టెంబర్ 2న ఓ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించారు. చార్లీ కిర్క్, ‘టర్నింగ్ పాయింట్ యుఎస్‌ఎ’ యూత్ ఆర్గనైజేషన్ సిఈవో, సహవ్యవస్థాపకుడిగా ఉండేవారు. ఉతా వ్యాలీ యూనివర్శటీ క్యాంపస్‌లో ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొనప్పుడు కిర్క్ […]

నేపాల్ జైలులో 8 మంది ఖైదీల మృతి..15 వేల మంది పరారీ

ఖాట్మండూ: నేపాల్‌లో జెన్‌జెడ్ ఉద్యమకారులు చేపట్టిన ఆందోళనలను ఆసరా చేసుకొని జైళ్ల నుంచి ఖైదీలు పరారవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం మాదేష్ ప్రావిన్స్‌లో రమేచాప్ జిల్లా జైలు గోడలను గ్యాస్ సిలిండర్‌తో పేల్చి పరారవ్వడానికి ప్రయత్నించిన ఖైదీలను నివారించడానికి భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఖైదీల మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది.13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని రమేచాప్ జిల్లా ఆస్పత్రికి చికిత్స కోసం […]

కాల్పుల్లో ట్రంప్ మిత్రుడు జార్లి కిర్క్ మృతి

ఉటా లోని ఒరెమ్ లోని ఉటా వ్యాలీ యూనివర్సిటీలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, మితవాద అమెరికన్ కార్యకర్త చార్లీ కిర్క్ పై ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. మెడపై తుపాకీతో జరిపిన కాల్పులలో చార్లీ మరణించారు. కిర్క్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కాల్పులు జరిగిన క్షణంలో చిత్రీకరించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. హత్యకు సంబంధించి సెల్ ఫోన్ వీడియో క్లిప్ లలో కిర్క్ యూనివర్సిటీలో పెద్ద సంఖ్యలో జనాల్ని ఉద్దేశించి […]

నేపాల్ సారథి సుశీల కర్కీ

నేపాల్ లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వానికి మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి నాయకత్వం వహిస్తారు. ఈ మేరకు జనరల్ జెడ్ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. దాదాపు ఐదు వేలమంది యువకులు వర్చువల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.జనరల్ జెడ్ ఆన్ లైన్ లో నిర్వహించిన సమావేశం ప్రధానంగా దేశ అత్యున్నత పదవికి అర్హులైన అభ్యర్థులపై ప్రధానంగా చర్చించింది. ఒకదశలో ఖాట్మండు మేయర్ బాలెన్ షా పట్ల అనుకూలత వ్యక్తమైనా, ఆయనను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించక […]

నేపాల్ తాత్కాలిక సారథిగా సుశీలా కర్కీ?.. ‘జెన్‌జడ్’ చర్చలు!

ఖాట్మండ్: కల్లోల నేపాల్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాత్కాలిక సారథిని ఎన్నుకునేందుకు అక్కడి యువత (జెన్‌జెడ్) ముమ్మర చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కీ వైపు జెన్‌జెడ్ ఉద్యమకారులు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. తాత్కాలిక సారథిగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆమె కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. అవినీతికి వ్యతిరేకంగా నేపాల్‌లో కొనసాగుతున్న ఉద్యమం హింసాత్మక సంఘటనలకు దారి తీయడంతో ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రులు […]

మంత్రిగా నియమితులైన కొంతసేపటికే కుప్పకూలిన మంత్రి

స్టాక్‌హోమ్ : స్వీడన్ ఆరోగ్యశాఖ మంత్రి ఎలిసాబెట్ లాన్ విలేకర్లతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మంత్రిగా నియమితులైన కొంతసేపటికే ఇది జరగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్వీడన్ ప్రధాన మంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ విలేకరుల సమావేశంలో ఎలిసాబెట్ లాన్‌ను ఆరోగ్యశాఖ మంత్రిగా ప్రకటించారు. ఈ ప్రకటన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా కుప్ప కూలిపోయారు. అక్కడ ఉన్నవారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. రక్తంలో చక్కెర స్థాయిలు పడిపోవడంతోనే […]

రష్యా డ్రోన్లను కూల్చివేసిన నాటో దేశం

వార్సా : ఎలాంటి అనుమతి లేకుండా పోలండ్ గగనతలం లోకి ప్రవేశించిన రష్యా డ్రోన్లను పోలండ్ ముందు జాగ్రత్తగా కూల్చి వేసింది. నాటో సభ్య దేశం లోకి డ్రోన్లు ప్రవేశించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ గగనతలం లోకి డ్రోన్లు ప్రవేశించడంపై నాటో సెక్రటరీ జనరల్‌కు సమాచారం ఇచ్చామని పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ చెప్పారు. ఈ సందర్భంగా టస్క్ ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు ఆయన కార్యాలయం పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని […]