ఇమిగ్రేషన్ దుష్ఫలితం.. భారతీయుడి హత్యపై ట్రంప్ స్పందన

హుస్టన్: అమెరికాలోని డల్లాస్‌లో మోటెల్ మేనెజర్ అయిన ఓ భారతీయ సంతతి వ్యక్తి దారుణ హత్యను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇది గర్హనీయం అన్నారు. దేశంలో అక్రమ రీతిలో ఉన్న ఇమిగ్రేషన్ విధానంతోనే ఇటువంటి దురాగతాలు జరుగుతున్నాయని విమర్శించారు. అక్రమ విదేశీయుడు, ఇంతకు ముందు నేరచర్యల రికార్డు ఉన్న క్యూబా వలసదారు చేతిలోనే అత్యంత క్రూరంగా ఈ భారతీయ సంతతి వ్యక్తి హతుడు కావడం బాధాకరం అన్నారు. కర్నాటకు చెందిన 50 సంవత్సరాల చంద్రమౌళి బాబ్ […]

దెబ్బకు దిగొచ్చిన ట్రంప్.. విదేశీ ఉద్యోగులను నియమించుకోండంటూ పోస్ట్

వాషింగ్టన్ : అమెరికా పరిశ్రమలలో విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. యూఎస్‌లో పెట్టుబడుల గురించి తాము ఆలోచిస్తామంటూ దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో అధ్యక్షుడు దెబ్బకు దిగొచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే..? ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి అక్రమ వలసల విషయంలో కఠినవైఖరి అవలంబిస్తున్నారు. వారిని గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల జార్జియాలో 475 మంది అక్రమ వలసదార్లను నిర్బంధించినట్టు హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. […]

లండన్‌లోనూ వలసల కొలిమంటుకుంది

లండన్: బ్రిటన్ చరిత్రలోనే అతి పెద్ద వలస వ్యతిరేకవాదుల భారీ ప్రదర్శన శనివారం సెంట్రల్ లండన్ లో జరిగింది. వలస వ్యతిరేక కార్యకర్త టామీ రాబిన్సన్ నాయకత్వంలో “యునైట్ ది కింగ్ డమ్‌” పేరుతో లక్షన్నరమందికి పైగా నిరసన కారులు వలసవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. ఈ ప్రదర్శనల సమయంలో అనేకమంది అధికారులపై దాడి జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వారిని పంపివేయండి, మాదేశాన్ని మాకు మళ్లీ ఇవ్వండి, ఇంగ్లీషు చాలు, మా పిల్లల భవిష్యత్ కాపాడండి అని వారు […]

పారిపోయిన జైలు ఖైదీలను పట్టుకున్న నేపాల్ పోలీసులు

ఖాట్మాండు: నేపాల్‌లో గత వారం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పెల్లుబికినప్పుడు వివిధ జైళ్ల నుంచి 3700కు పైగా ఖైదీలు తప్పించుకు పారిపోయారు. అయితే వారిని నేపాల్ పోలీసులు ఆదివారం తిరిగి అరెస్టు చేశారు. ఆదివారం మధ్యాహ్నం వరకు 3723 ఖైదీలను తిరిగి జైళ్లకు తెచ్చామని నేపాల్ పోలీస్ ప్రతినిధి డిఐజి బినోద్ ఘిమిరే తెలిపారు. కాగా ఇప్పటికీ 10320 మంది ఖైదీలు పారారీలో ఉన్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కాగా కొంత మంది ఖైదీలు […]

ఐరాస కీలక సంస్థకు చైర్‌పర్సన్‌గా ప్రీతి శరణ్

న్యూయార్క్: సంక్లిష్టమైన బహుపాక్షిక సమస్యలను పరిష్కరించడంలో ఉన్న అనుభవం దృష్టా మాజీ దౌత్యవేత్త ప్రీతి శరణ్ ప్రతిష్టాత్మకమైన ఐక్యరాజ్య సమితి తాలూకు కమిటీ ఆన్ ఎకనామిక్, సోషల్ అండ్ కల్చరల్ రైట్స్(సిఈఎస్‌సిఆర్) చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. సిఈఎస్‌సిఆర్ అనేది ఐక్యరాజ్య సమితిలో కీలకమైన సంస్థ. ఇది సభ్య దేశాలు ఆర్థిక, సామాజిక హక్కులపై అంతర్జాతీయ ఒప్పందాల అమలును పర్యవేక్షించే బాధ్యతను కలిగి ఉంది. ప్రీతి శరణ్‌కు ఇండియాలోనే కాక ఆసియా, ఆఫ్రికా, యూరొప్, అమెరికాలలో ఇండియన్ మిషన్స్ వివిధ […]

పాకిస్తాన్లో వరదల విధ్వంసం.. 101 మంది మృతి, నిరాశ్రయులైన 25 లక్షల మంది..

పాకిస్తాన్ లో వరదలు విధ్వంసం సృష్టించాయి. దక్షిణ పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరదలు సంభవిచండంతో దాదాపు 2.5 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులు అయ్యారని.. దాదాపు 101 మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక అధికారులు తెలిపారు. ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ.. విధ్వంసం స్థాయి ఇంకా స్థిరంగానే ఉందని చెప్పారు. ముల్తాన్, ముజఫర్‌గఢ్, రహీమ్ యార్ ఖాన్ జిల్లాల్లోని పలు గ్రామాలు వరదలు ముంచెత్తాయి. వరదల్లో చిక్కుకున్న కుటుంబాలను రక్షించడానికి 1,500 […]

వచ్చే ఏడాది మార్చి 5న నేపాల్ పార్లమెంట్ ఎన్నికలు

ఖాట్మండూ: నేపాల్‌లో తదుపరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి 5న జరుగుతాయని అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కార్యాలయం వెల్లడించింది. శుక్రవారం కొత్తగా నియామకమైన ప్రధాని సుశీలా కర్కి సిఫార్సుపై ప్రజా ప్రతినిధుల సభను రద్దు చేసిన తరువాత అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఎన్నికల తేదీని ప్రకటించారు. యువత ఆందోళనల ఫలితంగా ప్రధాని పదవికి ఒలి రాజీనామా చేసిన తరువాత ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని పరిష్కరించడానికి 73 ఏళ్ల మాజీ చీఫ్ జస్టిస్ కర్కి తాత్కాలిక ప్రధానిగా […]

పాక్‌లో రెండు ఎన్‌కౌంటర్లు.. 12మంది సైనికులు, 35మంది ఉగ్రవాదులు మృతి

పెషావర్: పాకిస్థాన్ లోని వాయువ్య ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లో గత నాలుగు రోజుల్లో ఆర్మీ నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 12 మంది సైనికులు, 35 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. మిలిటరీ మీడియా విభాగానికి చెందిన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్‌పిఆర్)ఈ ఆపరేషన్ల వివరాలను శనివారం వెల్లడించింది. బజౌర్ జిల్లాలో భద్రతాదళాలు ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్వహించిన ఆపరేషన్‌లో తీవ్రమైన ఎదురెదురు కాల్పుల్లో 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఎన్‌కౌంటర్ దక్షిణ వజిరిస్తాన్ జిల్లాలో జరిగింది. తెహ్రేక్ […]

పడవ ప్రమాదాల్లో 193 మంది జలసమాధి

boat accidents Congo

కిన్సాసా: కాంగోలో ఘోర రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. రెండో ప్రమాదంలో 193 మంది జలసమాధయ్యాయి. ఈక్వెటర్ ప్రావిన్స్‌కు 150 కిలో మీటర్ల దూరంలో పడవ బోల్తాపడి 86 మంది చనిపోయారు. గురువారం సాయంత్ర లుకోళెలా ప్రాంతంలో మలాంగ్ గ్రామం సమీపంలో కాంగో నదిలో పడవ ప్రయాణిస్తుండగా మంటలు అంటుకోవడంతో 107 మంది సజీవదహనమయ్యారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో 500 మంది ప్రయాణికులు ఉన్నారు. రెస్క్యూ సిబ్బంది 209 మందిని కాపాడారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం […]

నేపాల్ హింసాకాండలో 51కి చేరిన మృతుల సంఖ్య

నేపాల్‌లో ఇటీవలి జెన్ జడ్ ఉద్యమంలో చెలరేగిన హింసాకాండలో మృతుల సంఖ్య 51కి చేరుకుంది. మృతులలో కొందరు మంటలలో చిక్కుకుని సజీవ దహనం చెందారు. ఉత్తర ప్రదేశ్‌లోని గజియాబాద్ నివాసి 57 సంవత్సరాల మహిళ రాజేష్ గోలా ఖాట్మండులోని హ్యాత్ రిజెన్సీ హోటల్‌లో బస చేసిన దశలో మృతి చెందారు.ఆమె వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ మంది యాత్రికులు ఉంటున్న ఈ హోటల్‌కు నిరసనకారులు నిప్పుపెట్టారు. బయటపడే ఆమె నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకే […]