10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి : జగదీశ్ రెడ్డి

BRS MLAs Additional Secretary

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై బిఆర్ఎస్ పార్టీ నిర్ణయం చెప్పాలని తమకు 3 రోజులు గడువు ఇచ్చారని బిఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణను తమకు తెలియజేశారని అన్నారు. శాసనసభ అదనపు కార్యదర్శి ఉపేందర్ రెడ్డిని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభిప్రాయం చెప్పారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై శాసనసభాపక్షం అభిప్రాయం అందించారు.

10 మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారని ఆధారాలు అందించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నామని, 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు కూడా చెప్పిందని అన్నారు. 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ మారలేదని చెప్తున్నారని తెలియజేశారు. బిఆర్ఎస్, మాజీ సిఎం కెసిఆర్ పై తమకు విశ్వాసం ఉందని స్పీకర్ వివరణ ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ సమావేశాలకు వెళ్తూ బిఆర్ఎస్ లోనే ఉన్నామని అంటున్నారని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : కవితతో విష్ణువర్ధన్ రెడ్డి భేటీ…. జూబ్లీహిల్స్ అభ్యర్థి?