కవితతో విష్ణువర్ధన్ రెడ్డి భేటీ…. జూబ్లీహిల్స్ అభ్యర్థి?

Vishnuvardhan Reddy meets Kavitha

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో ఎంఎల్ఎ కవిత తరపున అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం ఉంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి సమావేశమయ్యారు. ఇద్దరు మధ్య దాదాపుగా అరగంటకు పైగా మంతనాలు సాగాయి. ఉపఎన్నికలో విష్ణును పోటీకి దించే యోచనలో కల్వకుంట్ల కవిత ఉన్నట్టు సమాచారం.

Also Read:  నో షేక్‌హ్యాండ్.. పాకిస్తాన్ కు భారత్ షాక్(వీడియో)

బిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ కార్యకర్తలతో కెటిఆర్ సమావేశమైన విషయం తెలిసిందే. సునీత పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దింపాలని ఆ పార్టీ అధిష్ఠానం వ్యూత్మకంగా అడుగులు వేయాలని యోచిస్తోన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇక్కడి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగుంట గోపినాథ్ అకాల మరణంతో ఉప ఎన్నిక జరగబోతున్న విషయం తెలిసిందే.