కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడం సిగ్గుచేటు: హరీశ్ రావు

Harish Rao comments Revanth Reddy

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయట్లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకపోవటంపై హరీశ్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొద్దునిద్ర వీడకపోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.  రాష్ట్రంలోని విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి ఉందని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరమని, విద్యాసంస్థలు బంద్ ప్రకటించినప్పటికీ సిఎం నోరు మెదపట్లేదని ధ్వజమెత్తారు. టెండర్లు పిలిచేందుకు ఉన్న డబ్బులు.. బకాయిలు చెల్లించేందుకు లేవా? అని ప్రశ్నించారు. కమీషన్ల కోసమే టెండర్లు పిలుస్తున్నారని కాంగ్రెస్ ను హరీశ్ రావు దుయ్యబట్టారు.

Also Read : ఆ కుటుంబాలకు న్యాయం చేస్తాం: కెటిఆర్