భారత్‌తో పోరు అంత ఈజీ కాదు: అజారుద్ధీన్

Mohammad Azharuddin

ఆసియాకప్-2025లో ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌లు దుబాయ్ వేదకిగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అని చాలా మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్ (Mohammad Azharuddin) కూడా అదే విషయాన్ని తెలిపారు. అయితే పాకిస్థాన్‌లో ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకపోవడం పాకిస్థాన్‌కు పెద్ద లోటు అని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజామ్, మహ్మద్ రిజ్వాన్‌లు లేకుండానే ఈ టోర్నమెంట్‌లో ఆడుతోంది. అయితే ఒమాన్‌పై విజయం సాధించిన పాక్‌, ఆ ఇద్దరు ఆటగాళ్లు లేకుండా భారత్‌తో తలపడలేని పరిస్థితి ఉందని అజారుద్ధీన్ పేర్కొన్నారు.

‘‘భారత జట్టులో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. అత్యుత్తమ ప్రదర్శన చేసే ఆటగాళ్లు మన సొంతం. ఇక పాకిస్థాన్‌ జట్టు చాలా బలహీనంగా ఉంది. భారత్‌కు పోటీ ఇచ్చే పరిస్థితిలో లేదు. అత్యుత్తమ ప్లేయర్లు బాబర్ ఆజామ్, రిజ్వాన్‌లను పక్కన పెట్టారు. అయితే క్రికెట్‌లో ఎప్పుడూ ఏం జరుగుతుందో ఊహించలేం. కానీ, భారత్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉంది’’ అని అజారుద్ధీన్ (Mohammad Azharuddin) వెల్లడించారు.

Also Read : పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్‌ చేయాలి: పహల్గామ్‌ ఉగ్రదాడి బాధిత కుటుంబాలు