నడిరోడ్డుపై ప్రియురాలిని తుపాకీ కాల్చి చంపి…. ప్రియుడు హల్ చల్

bhopal Nandini Aravind

భోపాల్: ప్రియుడు, ప్రియురాలు మధ్య మనస్పర్థలు రావడంతో ఆమెను పోలీస్ స్టేషన్‌కు వెళ్తుండగా ఆమెను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గ్యాలియర్‌లో అరవింద్ పరిహార్ అనే కాంట్రాక్టర్ నివసిస్తున్నాడు. నందిని అనే యువతితో(28) అతడు సహజీవనం చేస్తున్నాడు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. అరవింద్‌తో ప్రాణహాని ఉందని పోలీస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. శనివారం ఫిర్యాదు చేయడానికి ఎస్‌పి కార్యాలయానికి వెళ్తుండగా రూప్ సింగ్ కార్యాలయానికి సమీపంలో ఆమెను అరవింద్ అడ్డుకొని కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే కూలిపోయింది. అతడు పక్కనే తుపాకీ పట్టుకొని కూర్చున్నాడు. స్థానికులు భయంతో వణికిపోయాడు. పోలీసులు దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించగా నిందితుడు తుపాకీతో బెదిరించాడు. దీంతో బాష్పవాయువు ప్రయోగించి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.  2017లో నందిని హత్య కేసులో నిందితురాలుగా ఉన్నారు.

Also Read: మూలాలు మరచి.. విన్యాసాలెందుకు?