తప్పు చేస్తే మాత్రం ఏ పార్టీ వాళ్లను అయినా శిక్షించండి – ఎస్పీలతో సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీల సమావేశంలో మాట్లాడిన ఆయన.. పెట్టుబడులకు శాంతిభద్రతలే కీలకమన్నారు. రాజకీయ ముసుగులో నేరాలను ఉపేక్షించొద్దని తెలిపారు. రియాక్ట్, రీచ్‌, రెస్పాండ్‌, రిజల్ట్‌ విధానం పాటించాలని సూచించారు.