పసికూన ఓమన్‌పై గెలిచిన పాక్

Pakistan won on Oman

దుబాయ్: ఆసియా కప్‌లో భాగంగా ఓమన్‌పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఓమన్‌పై పాక్ 93 పరుగులు తేడాతో గెలిచింది. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓమన్ ముందు 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓమన్ మాత్రం 16.4 ఓవర్లలో పది వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. పాక్ బౌలర్లు విజృంభించడంతో ఓమన్ జట్టు కుప్పకూలింది. పాక్ బ్యాట్స్‌మెన్లు మహ్మద్ హరిస్(66), సహిబాజాదా పర్హన్(29), పఖర్ జమాన్(23), మహ్మద్ నవాజ్(19), మిగిలిన బ్యాట్స్‌మెన్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. 66 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించిన హరిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.