వినాయక చవితి వేడుకల్లో అపశృతి: 8 మంది మృతి

Hassan district Karnataka

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హసన్‌ జిల్లాలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మోసాలి హోసహళ్లి గ్రామ శివారులో గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో భక్తులపైకి కంటైనర్ దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 17 మందికి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కు ఆరకళగుడి నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ట్రక్కు డ్రైవర్ భువనేశ్ ను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి చికిత్స కోసం డబ్బులు ఇస్తామని తెలిపింది. మృతులందరూ యువకులు ఉన్నారు.

Also Read: జిఎస్‌టి ఎగవేతదారులపై కొరడా