హైదరాబాద్: మ్యాన్ హోల్ ఘటనలో హైడ్రాదే పూర్తి బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మ్యాన్ హోల్ ఘటనపై ఉదయం ప్రాథమిక విచారణ జరిగిందని అన్నారు. గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత్ పురాలో మూతలేని మ్యాన్ హోల్ కారణంగా ఆరు సంవత్సరాల బాలిక ప్రమాదానికి గురైంది. ఈ ఘటనపై హైడ్రా కమిషనర్ స్పందించారు. మాన్ సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్ ఛార్జి ఈ ఘటనకు బాధ్యుడని, మ్యాన్ హోల్ మూత మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకున్నామని తెలియజేశారు. బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు.
Also Read : రైళ్లో నుంచి కిందపడి హీరోయిన్‌కు గాయాలు