ఈ రోజు ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా, నిఫ్టీ 252 పాయింట్లకు పైగా పతనమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫార్మా రంగంపై కొత్తగా సుంకాలను (Tariffs) ప్రకటించడం, హెచ్-1బీ వీసా (H-1B Visa) ఫీజు పెంపుదల వంటి అంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.