హైదరాబాద్: పాల ఉత్పత్తులపై జిఎస్ టి తగ్గించి ఇవ్వడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. కొత్త జిఎస్ టి అమల్లోకి వచ్చి మూడు రోజులైనా పాల ధరల్లో మార్పులు లేవని మండిపడుతున్నారు. పాత ధరలకే పాల ఉత్పత్తులు వ్యాపారులు అమ్ముతుండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంపెనీలు జిఎస్ టి తగ్గించి ఇవ్వడంలేదని వ్యాపారులు వాపోతున్నారు. ధరల డిస్‌ప్లే బోర్డులు ఎక్కడా కనిపించకపోవడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. జిఎస్టి తగ్గిన చాలా వస్తువులను పాత రేటుపై అమ్ముతున్నారని ప్రజలు ధ్వజమెత్తుతున్నారు.
Also Read: స్థానిక సమరం… రిజర్వేషన్లు ఖరారు?