కృష్ణా, గోదావరి బేసిన్లలో వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలలో వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. మరోవైపు లోతట్టు ప్రాంతాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.