స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాతి కాలంలో న్యాయవాదులు, ఆస్తిపరులు, భూస్వాములు మాత్రమే ఎక్కువగా రాజకీయ పార్టీల్లో చేరేవారు. వారిలో సేవాభావం కొందరిదైతే, పెత్తనం చెలాయించాలని ఆశ ఇంకొందరిది. మిగతా అల్పాదాయ, దిగువ సామాజిక వర్గాలు పనులు చేసుకునే బతికేవి. ఎన్నికల వేళ ఓటు వేయడం తప్ప వారికి నాయకులతో పెద్దగా పనిపడేది కాదు. ఆ రోజుల్లో దేశంలో కాంగ్రెస్ ఒక్కటే అతిపెద్ద పార్టీ. ఎమర్జెన్సీ తర్వాత దానిపై ప్రజలకు విశ్వాసం సడలింది. ఆ తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి.
‘రాజకీయం మూర్ఖుడి చివరి స్థావరం’ అనే నానుడి ఒకటుంది. జాతీయవాదం అనే చోట రాజకీయం అనే పదం వాడి ఈ మాట అర్థాన్ని వ్యంగ్యంగా మార్చారనే వాదన కూడా ఉంది. నిజమేదైనా మారుతున్న నేటి రాజకీయ పరిస్థితుల లెక్కన ఈ రెండు పదాలకు ఆ వ్యాఖ్యానం సరిపోతుందనుకోవాలి. ఈ రోజుల్లో రాజకీయం అనేది సేవా ప్రవృత్తి నుండి పూర్తికాలపు వృత్తిగా మారిపోయింది. సేవకు నియమాలు, పట్టింపులు గాని వృత్తి, వ్యాపారాలకు ఎదుగుదలే లక్ష్యం. అందుకే రాజకీయాల్లో కొనసాగుతున్నవారు ఎవరైనా ఉన్న పార్టీని వదిలేసి కొత్త పార్టీలో చేరితే తప్పుగా పరిగణించలేము. ఒక పార్టీ టికెట్‌పై గెలిచి మరో పార్టీలో చేరడం తప్ప మిగతా అన్ని సందర్భాల్లో వారు మార్పిడిలో స్వతంత్రులే. సమయ స్ఫూర్తితో పార్టీ మారి నష్టపోయినవారికన్నా లాభపడ్డవారే ఎక్కువ. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాతి కాలంలో న్యాయవాదులు, ఆస్తిపరులు, భూస్వాములు మాత్రమే ఎక్కువగా రాజకీయ పార్టీల్లో చేరేవారు. వారిలో సేవాభావం కొందరిదైతే, పెత్తనం చెలాయించాలని ఆశ ఇంకొందరిది. మిగతా అల్పాదాయ, దిగువ సామాజిక వర్గాలు పనులు చేసుకునే బతికేవి.
ఎన్నికల వేళ ఓటు వేయడం తప్ప వారికి నాయకులతో పెద్దగా పనిపడేది కాదు. ఆ రోజుల్లో దేశంలో కాంగ్రెస్ ఒక్కటే అతిపెద్ద పార్టీ. ఎమర్జెన్సీ తర్వాత దానిపై ప్రజలకు విశ్వాసం సడలింది. ఆ తర్వాత దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి.వాటి ఉనికిని, అవసరాన్ని స్థానిక ప్రజలు గ్రహించి, కావాలనుకున్నప్పుడు ఆ పార్టీలకు పట్టం కడుతున్నారు. ఈ రకంగా రాజకీయాలు చేసేవారికి మైదానం పెరిగిపోయింది. ప్రాంతీయ పార్టీల ప్రోత్సాహంతో దాదాపుగా అన్ని వర్గాలవారు రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీలోనో, ప్రజల్లోనో ఏదో ఓ పదవి వరించినా ఏ లీడర్ సింగిల్‌గా ఎటూ కదలడు. మా నాయకుడు వేంచేసాడహో అని సందడి చేసే అనుచరగణం వెంటుంటేనే ఆయనకు విలువ. అలా శిష్యరికం చేసినవారిలోంచి కొందరు నేతలుగా ఎదిగిపోయారు. అలా చేరే వారి సంఖ్య పెరిగి రాజకీయం వృత్తిగా మారిపోయింది. ఇక పార్టీ మారే అవసరాలు ఎందుకంటే ఒకే పార్టీలో ఎంతకాలమున్నా కోరుకున్న స్థానం అందరికీ దక్కదు. పార్టీలోని సీనియర్లు ఆ అవకాశాన్ని రాకుండా అడ్డుకుంటారు. ఒక చోట దొరకని ఎదుగుదల మరో పార్టీలో లభిస్తే వదులుకోకూడదు.
ఇన్నాళ్లు నమ్ముకున్న పార్టీ, రాజకీయ ప్రవేశానికి అవకాశమిచ్చిన పార్టీ, కష్టకాలంలో ఉన్న పార్టీ అనే భావన రాజకీయ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టుతో సమానమే. పార్టీకి తన వల్ల ఎంత లాభమో, తనకు కూడా ఆ పార్టీ వల్ల అంతే లేదా అంతకన్నా ఎక్కువ లాభం ఉన్నప్పుడే సదరు పార్టీలో కొనసాగాలి. కొత్తగా ఏర్పడే పార్టీలకు ప్రజాదరణ ఉండే అవకాశాలుంటే ముందుగానే చేరితే వ్యక్తిగత గౌరవం, ప్రయోజనం ఎక్కువ. అలాంటి ప్రాప్తకాలజ్ఞులకు ఈ రంగంలో విజయాలు ఎక్కువ. సరియైన సమయంలో పార్టీ మార్పిడి ఎంత లాభమో, మారకుంటే వచ్చే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. తెలంగాణ ఏర్పడి భారాస పాలనలోకి వచ్చాక టిడిపి, కాంగ్రెస్ నుండి చాలా మంది భారాసలోకి మారిపోయారు. టిడిపి వాళ్లకయితే అది అనివార్యం. కాంగ్రెస్ నుండి భారాసలోకి మారి లాభపడ్డవారు కొందరైతే, మారక నష్టపోయినవారు కూడా ఉన్నారు. లాభించినవారి విషయంలో ఖద్దరు బట్టల కాంగ్రెస్ సీనియర్ నాయకుడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆయన తెలివిగా 2013లోనే భారాసలో చేరి ఎన్నికల్లో పోటీ, డబ్బు ఖర్చు అవసరం లేకుండా ఉన్నన్నాళ్లు పార్టీలో ప్రత్యేక హోదా, రాజ్యసభలో సభ్యత్వం పొంది భోగాలు అనుభవించారని చెప్పవచ్చు. విదేశంలోంచి కూతురును రప్పించి ఉన్నత పదవిలో కూచోబెట్టారు.
మళ్లీ 2014లో కాంగ్రెస్ లోకి మారి, చేరిన మూడు రోజులకే కేబినెట్ ర్యాంక్ గల రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. 86 ఏళ్ల వయసులోనూ పాలక పక్ష రాజకీయాల్లో చీకూ చింతా లేకుండా గడపడం ఆయన పార్టీ మారడం వల్లే సంభవించింది. ఆయన వివాద రహిత స్వభావం వల్ల ఈ మార్పులను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ రెడ్డి సామాజిక వర్గ కాంగ్రెస్ సీనియర్ నేత 1989 నుండి ఒకే పార్టీలో ఉంటున్నారు. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా, రెండు మార్లు మాత్రమే, కేవలం మూడేళ్లు మంత్రిగా ఉన్నారు. పార్టీనుంచి ఆయన పొందిన దాని కన్నా పార్టీకి చేసినా మేలే ఎక్కువ. తమ ప్రాంతంలో టిడిపి, బిఆర్‌ఎస్ పార్టీలకు ఎదురొడ్డి నిలిచినా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆయనకు దక్కినదేమీ లేదు. పైగా ఆయనపై గెలిచిన భారాస ఎంఎల్‌ఎకు పార్టీ కండువా కప్పి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నారు. పార్టీపై అభిమానం చంపుకొని పాలక పక్షాల్లోకి దూకితే పదవీ సౌఖ్యం దొరికేది, ఏడు పదుల వయసులో ఈ మానసిక క్షోభ తప్పేది. రాజకీయం అంటే తెలివైన మోసం అని దాని అర్థమే మారిపోయినపుడు రాజకీయం చేయడమే ఆ వృత్తి లక్షణం.
బద్రి నర్సన్ 94401 28169
Also Read: భారత్-అమెరికా సంబంధాలు ఎటు?