హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో రక్షణశాఖ భూములలో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. భారీ పోలీస్ బందోబస్త్ తో కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆక్రమణ నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కంటోన్మెంట్ పరిధిలోని రక్షణ శాఖకు భూములలో 120 భవనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని వివాదంలో ఉండడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. భవనం నెంబర్ 190 అనే మేడ్చల్ రహదారి పక్కనే ఉంది. దీని మల్లారెడ్డి గార్డెన్ కూడా ఉంది. ఈ భవనంలో రాజీవ్ గాంధీ ఏవియేషన్ అకాడమీ నిర్వహిస్తున్నారు. ఇది అక్రమ నిర్మాణం కావడంతో అధికారుల కూల్చేశారు. కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు రోడ్డున పడ్డారు. అలాగే సర్వేనంబర్ 538లో అక్రమంగా ఓ భవనాన్ని నిర్మించారని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఆ భవనాన్ని కూడా కూల్చివేశారు. కోర్టు తీర్పు మేరకు మాత్రమే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నామని అధికారులు వెల్లడించారు. రక్షణ శాఖకు సంబంధించిన భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.