కుషాయిగూడ: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుషాయిగూడ ప్రాంతం కాప్రాలో దారుణం వెలుగులోకి వచ్చింది. రాధిక థియేటర్ సమీపంలో భార్య గొంతు కోసి భర్త దారుణంగా హత్య చేశాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ముంబయికి చెందిన మహిళగా గుర్తించారు. భర్త పరారీలో ఉన్నట్టు సమాచారం. దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: మావోయిస్టు పార్టీలో ముసలం!