2022లో విడుదలైన ‘కాంతార‘ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త రికార్డులు నెలకొల్పింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్‌గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12:45 గంటలకు విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అద్భుతమైన పోస్టర్ షేర్ చేశారు. హోంబలే ఫిలింస్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో కాంతార: చాప్టర్ 1 ఒకటి. ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రంలో 500 మంది యోధులు, సుమారు 3,000 మంది ప్రజలు పాల్గొనే ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందించారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో 25 ఎకరాల పట్టణం నిర్మించి, దాదాపు 45, -50 రోజులపాటు ఈ షూటింగ్ జరిగింది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సన్నివేశాల్లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : ఐఫోన్ కోసం బారులు..బారులు