ఏపీ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు కొనసాగుతున్నాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందులో భాగంగా పలువురు సభ్యులు మాట్లాడారు. మరోవైపు మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ జరపాలంటూ డిమాండ్ చేశారు. మండలి పోడియంను చుట్టుముట్టారు.