ఫార్ములా ఈకార్‌రేసు నిందితులపై త్వరలో ఛార్జిషీట్

మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం చోటు చే సుకుంది. ప్రభుత్వానికి ఎసిబి అధికారులు నివేదిక సమర్పించారు. దీంతో ప్రభుత్వం ఏ నిర్ణ యం తీసుకుంటుందన్న దానిపై ఉత్కంఠ రేపుతుంది. ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధిం చి ఎసిబి సుదీర్ఘకాలం విచారించింది. బిఆర్‌ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌ను రెండు సార్లు విచారణ చేసింది. ఈ కేసులో విషయాలను గు రించి ఆరా తీసింది. సిఎం ఢిల్లీలో ఉండటంతో బుధవారం ఆయన వచ్చిన తర్వాత దీనిపై మం త్రివర్గ సభ్యులతో కూర్చుని మాట్లాడతారని తెలిసింది. దాదాపు తొమ్మిది నెలల పాటు విచారించిన ఎసిబి అధికారులు దీనిపై నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ కేసులో కెటిఆర్, ఐ ఎఎస్ అర్వింద్ కుమార్, బిఎల్‌ఎన్ రెడ్డి, కిరణ్ రావు, ఎఫ్‌ఈఓలను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ అనుమతి కోసం ప్రభుత్వానికి రిపో ర్టు ఇచ్చింది. గవర్నర్ అనుమతి రాగానే ఫార్ము లా ఈ కార్ రేసులో  నిందితులపై చార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణ సంస్థకు హెచ్‌ఎండీఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయిందని, దాదాపు రూ.55 కోట్లు దుర్వినియోగం జరిగినట్లు ఎసిబి కేసు నమోదు చేసింది. ఈ కేసులో ముగ్గురిపై ఎసిబి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఎ1గా మాజీ మంత్రి కేటీఆర్, ఎ2గా సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్, ఎ3గా హెచ్‌ఎండీఏ మాజీ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన సంగతి విదితమే. అయితే, ఈ కారు కేసులో ఫెమా నిబంధనలు ఉల్లఘించినట్టు ఇడి పేర్కొంది. ఈ కేసులో కెటిఆర్‌ను రెండు సార్లు, ఐఏఎస్ అర్వింద్ కుమార్‌ను మూడు సార్లు ఎసిబి విచారిం చింది. కెటిఆర్, అర్వింద్ కుమార్ స్టేట్ మెంట్లను ఎసిబి రికార్డ్ చేసింది. ఈ కేసులో క్విడ్ ప్రోక్ జరిగినట్లు తేల్చింది. ఈ కార్ రేసింగ్‌కు స్పాన్సర్ షిప్ చేసిన సంస్థల నుంచి బిఆర్‌ఎస్ పార్టీకి రూ.44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వచ్చాయని ఈ విధంగా క్విడ్ ప్రోకో జరిగి నట్టు ఎసిబి నిర్ధారించింది.