ప్రకాశం జిల్లా తర్లుపాడులో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భార్యను తాళ్లతో కట్టేసి బెల్టుతో కొడుతూ, కాళ్లతో తన్నుతూ చిత్రహింసలకు గురిచేసిన వీడియో బయటికొచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.