విద్యుత్‌శాఖలో… అవినీతి అనకొండ

మన తెలంగాణ/సిటీ బ్యూరో: అక్రమాస్తుల కేసు లో మరోభారీ తిమింగలం ఎసిబికి చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నరన్న ఆరోపణలతో ఎసిబి అధికారులు విద్యుత్ శాఖ ఎడిఈ ఇ ల్లు,బంధువుల ఇళ్లపై మంగళవారం దాడులు చే శారు.ఎసిబి అధికారుల దాడులో ఇంజనీర్‌కు సం బంధించిన ఆస్తులను భారీగా కనుగొన్నారు. ఎరు గు అంబేద్కర్ టిజిఎస్‌పిడిసిఎల్, ఇబ్రహీంబాగ్ పరిధిలో ఆపరేషన్స్ ఎడిఈగా (అసిస్టెంట్ డివిజన్ ఇంజనీర్) పనిచేస్తున్నాడు. అంబేద్కర్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని పలువురు ఎసిబికి పలువురు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేసి ఎసిబి అధికారులు కొండాపూర్‌లో ఎడిఈ ఇల్లు, బంధువులు, బినామీలకు చెందిన 15 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మెదక్, సూర్యపేట, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో 12 బృందాలు దాడులు చేశాయి. ఎసిబి సోదాల్లో ఎడిఈకి సంబంధించిన ఆస్థులు భారీగా కనుగొన్నారు.

ఎడిఈ బినామి ఇంట్లో రూ.2,18,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎడిఈకి శేరిలింగంపల్లిలో ఫాట్, గచ్చిబౌలిలో జి ప్లస్ ఫైవ్ భవనం, అంతార్ కెమికల్ కంపెనీ పేరుతో 10 ఏకరాల భూమి, హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతంలో ఆరు ప్లాట్లు, ఫాం హౌస్, రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లను కనుగొన్నారు. ఎడిఈకి సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ విలువ ఆధారంగా రూ.50కోట్లు ఉండగా, మార్కెట్ విలువ దీనికి పది రెట్లు ఉంటుందని తెలిసింది. మరికొన్ని ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయని ఎసిబి అధికారులు పేర్కొన్నారు. ఎఈడి అంబేద్కర్ కారులో రూ.5.50 లక్షల నగదు, బ్యాంక్‌లో రూ.70లక్షల డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ షేర్లలో రూ.36లక్షలు పెట్టుబడిపెట్టాడని ఎసిబి డిఎస్పి తెలిపారు. ఎడిఈ అంబేద్కర్‌ను అరెస్టు చేసిన ఎసిబి అధికారులు వైద్య పరీక్షలు చేయించి, నాంపల్లిలోని ఎసిబి కోర్టులో ప్రవేశపెట్టారు. జడ్జి ఆదేశాల మేరకు అంబేద్కర్‌ను రిమాండ్‌కు తరలించారు.