ఎయిర్‌టెల్‌తో సైబర్ మోసాలకు బ్రేక్: కస్టమర్ల ఆర్థిక నష్టాలు 70% తగ్గాయంటున్న కంపెనీ

ఎయిర్‌టెల్ అమలు చేస్తున్న అధునాతన యాంటీ-ఫ్రాడ్ కార్యక్రమాల వల్ల కస్టమర్ల ఆర్థిక నష్టాలు దాదాపు 70% వరకు తగ్గాయని కంపెనీ ప్రకటించింది. ఈ విషయం ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) నివేదిక ద్వారా స్పష్టమైందని తెలిపింది.