ఆ కేసులో సోనూసూద్ సహా మాజీ క్రికెటర్లకు ఇడి సమన్లు

Sonu Sood

న్యూఢిల్లీ: నటుడు సోనూ సూద్ తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. మనీలాండరింగ్‌ కేసులో నటుడు సోనూసూద్‌తో (Sonu Sood) పాటు మరో ఇద్దరు మాజీ క్రికెటర్లకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప, 23న యువరాజ్ సింగ్, 24న సోనూసూద్‌లను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది. నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యావ్ లావాదేవీల్లో మనీలాండరింగ్‌కు సంబంధించి ఇడి ఊతప్పను ప్రశ్నించనుంది.

ఈ కేసులో (Sonu Sood) ఇప్పటివరకూ ముగ్గురు మాజీ క్రికెటర్లకు సమన్లు అందాయి. మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధవన్‌లను ఇటీవలే ఇడి ప్రశ్నించింది. ఇదే కేసులో టిఎంసి మాజీ ఎంపి, నటి మిమి చక్రవర్తిని ఇడి సోమవారం ప్రశ్నించి.. ఆమె వాంగ్మూలం రికార్డు చేసింది. బెంగాలీ నటుడు అంకుశ్ హజ్రాను మంగళవారం ఇడి విచారిస్తుంది. నటి ఊర్వశీ రౌటెలా కూడి 1xBet బెట్టింగ్ యాప్‌నకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ఆమెకు కూడా నోటీసులు జారీ చేసింది.

Also Read : ఐసిసి ప్లేయర్ ఆఫ్‌ది మంత్‌గా సిరాజ్