సర్పంచ్‌లకే పవర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రమంతటా ఎ ల్‌ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏ ర్పాటు, వాటి నిర్వహణ బాధ్యతలను సర్పంచ్‌లకే అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రా మాల్లో అవసరమైన కొత్త ఎల్‌ఈడీ లైట్లను అమర్చటంతో పాటు వాటిని సమర్థంగా నిర్వహించే నిర్వహణ అధికారం గ్రామ పంచాయతీల పరిధిలోనే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. గ్రామా ల్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతున్నాయా లేదా, కొత్తగా ఎన్ని అవసర ఉ న్నాయన్న విషయాలను పక్కాగా అంచనా వేయాలని, ప్రతి పోల్ సర్వే చేయాలని పంచాయతీ రా జ్ శాఖ అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సోమవారం మున్సిపల్, పంచాయతీ రాజ్, జీహెచ్‌ఎంసీ అధికారులతో సిఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, కోర్ అర్బన్ ఏరియా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి, మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవి, జీహెచ్‌ఎంసి కమిషనర్ ఆర్వీ కర్ణన్, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శ్రీజన ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో అధికారులకు పలు అంశాలపై దిశానిర్ధేశం చేశారు.

పర్యవేక్షణ ఉండాలి…
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాత్రి సమయంలో ఎల్‌ఈడీ లైట్లు పని చేయడంతో పాటు పగటిపూట దుర్వినియోగం కాకుండా పర్యవేక్షణ ఉండాలని, అన్ని గ్రామాల ఎల్‌ఈడీల డ్యాష్ బోర్డుకు సంబంధించి మండల స్థాయిలో ఎంపిడిఓలో పర్యవేక్షణలో ఉండాలని, జిల్లాలో అడిషనల్ కలెక్టర్‌లకు ఈ బాధ్యతలు అప్పగించాలని సిఎం రేవంత్ ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల పరిధిలో 16.16 లక్షల ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయని, వరంగల్, నల్గొండ, జనగాం, నారాయణపేట జిల్లాల్లో ఎల్‌ఈడీ లైట్ల కాంట్రాక్టు ఏజెన్సీ అధ్వర్యంలో ఉందని అధికారులు సిఎంకు వివరించారు. అన్ని గ్రామాల్లో సర్పంచ్‌లకే వాటిని అప్పగిస్తే లైట్ల నిర్వహణ, విద్యుత్ దుర్వినియోగం కాకుండా అడ్డుకట్ట పడుతుందని అధికారులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఔటర్ లోపల 7.50 లక్షల లైట్లు
రాష్ట్రంలో అన్ని ఎల్‌ఈడీ లైట్లను హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 5.50 లక్షల ఎల్‌ఈడీ లైట్లు ఉన్నాయని, ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న కోర్ అర్బన్ సిటీని కూడా కలిపితే మొత్తం 7.50 లక్షల లైట్లు అవసరమవుతాయని మున్సిపల్ శాఖ సిఎంకు నివేదించింది. గతంలో ఉన్న ఏజెన్సీ కాంట్రాక్టు ముగియటంతో ఇప్పుడు చాలాచోట్ల లైట్లు వెలగటం లేదని, నిర్వహణ కూడా సరిగా జరగలేదని అధికారులు నివేదించారు. కోర్ అర్బన్ సిటీ పరిధిలో జీహెచ్‌ఎంసీతో పాటు కొత్తగా చేరిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలను పరిగణనలోకి తీసుకొని ఎల్‌ఈడీ లైట్ల అవసరాన్ని అంచనా వేయాలని సిఎం ఆదేశించారు. కొత్తగా ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, నిర్వహణకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఎల్‌ఈడీ లైట్ల తయారీలో పేరొందిన కంపెనీలను ఆహ్వనించాలని, ఏడేళ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కంపెనీలకు అప్పగించాలని, నిర్వహణ పక్కగా ఉండేందుకు వీలుగా టెండర్ నిబంధనలను రూపొందించుకోవాలని సిఎం సూచించారు.

ఎల్‌ఈడీ లైట్లతో పాటు కంట్రోల్ బాక్స్‌ల ఏర్పాటు, నిరంతరం అవి పనిచేస్తున్నాయా లేదా, ఏయే ప్రాంతాల్లో ఇబ్బందులున్నాయో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా వ్యవస్థ ఉండాలన్నారు. హైదరాబాద్ ఐఐటీ లాంటి సంస్థలతో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో వీధి దీపాలకు ప్రతి నెలా రూ.8 కోట్ల కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తుందని, విద్యుత్‌ను ఆదా చేసేందుకు సోలార్ పవర్ వినియోగించే అంశాన్ని, అందుకు అవసరమైన సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సిఎం ఆదేశించారు. కోర్ అర్బన్ సిటీ ఏరియాతో పాటు ఔటర్ అవతల ఉన్న మున్సిపాలిటీల్లోనూ ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలతో పాటు కొన్ని మున్సిపాలిటీల్లో కొత్త గ్రామాల విలీనం, గ్రామాల మార్పులు చేర్పులు జరిగాయన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకొని ఎల్‌ఈడీ లైట్ల అంచనా వేయాలని సిఎం సూచించారు. కోర్ అర్బన్ సిటీతో పాటు మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ లైట్లకు కూడా టెండర్లు పిలవాలని సిఎం ఆదేశించారు.

Also Read: 20 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంపు