వక్ఫ్‌పై పాక్షిక స్టే

న్యూఢిల్లీ : అత్యంత కీలకమైన వక్ఫ్ సవరణల చ ట్టం 2025పై సుప్రీంకోర్టు సో మవారం తమ ఆ దేశాలతో కూడిన రూలింగ్ వెలువరించింది. చ ట్టంలోని కొన్ని ప్రధాన నిబంధనలపై స్టే విధించింది. అయితే మొత్తం చట్టాన్ని నిలిపివేయాలనే వాదనను తోసిపుచ్చింది. ప్రత్యేకించి వక్ఫ్ ఆస్తుల విషయంలో రూలింగ్ ప్రధానమైంది. దీని మేరకు ఆస్తులకు సంబంధించి నియుక్త అధికారి ఆస్తులపై నివేదిక ఇచ్చేంత వరకూ ఆయా ఆ స్తులు వక్ఫ్ ఆస్తులుగా చలామణిలోకి రావని తే ల్చిచెప్పారు.వక్ఫ్ చట్టం రాజ్యాంగబద్ధత విష యంలో చాలా సానుకూలతలు ఉన్నాయని, మొత్తం చట్టం నిలిపివేత కుదరని పని అని స్ప ష్టం చేశారు. అ త్యంత వివాదాస్పద అంశానికి సంబంధించి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవా య్, న్యాయమూర్తి ఆగస్టీన్ జార్జి మసిహ్‌తో కూ డిన ధర్మాసనం సుదీర్ఘరీతిలో 128 పేజీల మ ధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. ఇక ఇప్పు డు చట్ట సవరణల్లో భాగంగా ఉన్న వక్ఫ్ బోర్డుల ఏర్పాటు అర్హత విషయంపై స్పష్టత ఇ చ్చింది.

ఐదు సంవత్సరాలుగా ఇస్లామ్ మతాచారాలను పాటించే వారే వక్ఫ్ ఏ ర్పాటుకు అర్హులనే క్లా జ్‌ను నిలిపివేసింది. ఏ విషయంలో అయినా సం స్థల రా జ్యాంగబద్ధతకు ఎక్కువగా అనుకూలత ఉంటే , ఆ ప్రక్రియ విధించడం జరిగిందని, ఈ విధంగా తమ రూలింగ్ సమతూకత , సమానత పాటింపులను గుర్తించాలని తెలిపారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించి జిల్లాల కలెక్టర్ల నిర్ణయాధికారంపై స్టే వెలువరించారు. ఇక కేంద్రీయ వక్ఫ్‌బోర్డులో మొత్తం 20 మంది సభ్యులకుగాను నలుగురికి మించి ముస్లిమేతరులు ఉండకుండా చూడాలని స్పష్టం చేసింది. ఇక రాష్ట్రాల వక్ఫ్‌బోర్డులలో మొత్తం 11 మంది సభ్యులలో ముగ్గురికి మించి ముస్లిమేతరులను తీసుకోరాదని కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఎప్రిల్‌లో పార్లమెంట్‌లో వక్ఫ్ చట్టం సవరణ బిల్లును ఆమోదించిన కొద్ది గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టులో వరుసగా వందకుపైగా దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం తాజాగా మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.

నియుక్త అధికారి నివేదిక తరువాతే ఆస్తుల నిర్థారణ
వక్ఫ్ ఆస్తులను ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలనేది ఉత్తర్వుల్లో కోర్టు స్పష్టం చేసింది. నియుక్త అధికారి ఓకవేళ సంబంధిత ఆస్తులు ప్రభుత్వ ఆస్తులని తేల్చివేస్తే దీనికి సంబంధించి సదరు అధికారి రెవెన్యూ రికార్డులలో మార్పులు చేయాల్సి ఉంటుంది. తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. సంబంధిత ట్రిబ్యునల్ లేదా అధికారి సరైన నిర్థారణ చేయనంత వరకూ వక్ఫ్ బోర్డు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అట్టి భూములను క్రయ విక్రయాలకు పెట్టరాదు, రెవెన్యూ రికార్డుల్లోకి చేర్చరాదు. బోర్డు రికార్డులను తారుమారు చేయరాదు. సవరిత చట్టంలోని సెక్షన్ 83 పరిధిలో పేరొన్న అంశాలు తేలేవరకూ వక్ఫ్ ఆస్తుల నిర్థారణ సంబంధిత సెక్షన్ 3 సి పరిధిలోకి ఆస్తులు చేరడానికి వీల్లేదు. కోర్టులు , ట్రిబ్యునల్ పూర్తి స్థాయి నిర్థారణ జరిగే వరకూ హై కోర్టు తుది ఆదేశాలు వెలువడే వరకూ మూడో వ్యక్తుల లేదా బృందాలు ఈ ఆస్తుల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు.

అయితే సాధ్యమైనంత వరకూ బోర్డు సంబంధించిన కార్యనిర్వాహక అధికారిగా, ప్రత్యేకించి ముస్లిం వర్గానికి చెందిన ఎక్స్ అఫిషియో సెక్రెటరీని నియమించాల్సి ఉంటుంది. ఈ మేరకు చేసిన సవరణను సుప్రీంకోర్టు యధాతథంగా ఉంచింది. ఇక ఆస్తులు ఇతర విషయాలకు సంబంధించి తమ రూలింగ్ మధ్యంతరం తాత్కాలికం అయి ఉంది. ప్రాధమిక స్థాయి నిర్థారణగా భావించాల్సి ఉంటుంది, ఈ క్రమంలో ఇప్పుడు వెలువరించిన రూలింగ్‌పై పిటిషనర్లు కానీ ప్రభుత్వం కానీ తుది విచారణ దశలో అప్పీలుకు వెళ్లే రాజ్యాంగపరమైన హక్కు ఉంటుంది. అన్నింటికి మించి వక్ఫ్ చట్టంతో అనుసంధానం అయిన విషయం ఏమిటంటే ఆస్తులను అమ్మకాలకు పెట్టరాదు, దానాలకు లేదా వారసత్వ ధారాదత్తానికి లేదా వేరే వారికి సంక్రమింపచేసేందుకు వీల్లేదు. వక్ఫ్ అనేది కేవలం సంబంధిత మతపరమైన లేదా ధార్మిక ఉద్ధేశాలకు సంబంధించినదే. అంటే మసీదుల నిర్మాణాలు , మదర్సాలు, ఆసుపత్రులు, ప్రజా సేవా సంస్థల ఏర్పాటు సంబంధితమే అని తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ కాదనడానికి వీల్లేదని తెలిపారు.

Also Read: 20 ఏళ్లు దాటిన వాహనాల రిజిస్ట్రేషన్ ఫీజు భారీగా పెంపు