ఈసారి భారత ఫార్మాని టార్గెట్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్! తమ దేశంలోకి దిగుమతి అవుతున్న బ్రాండెడ్, పేటెంట్ ఫార్మా వస్తువులపై 100శాతం సుంకాలను విధిస్తున్నట్టు ప్రకటించారు. అమెరికా మార్కెట్లో అత్యధిక వాటా కలిగిన భారత ఫార్మా కంపెనీలపై ఇది ఒక పిడుగు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.