ప్రపంచ ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ ఇటీవల తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా 11,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. కంపెనీ వేగంగా కృత్రిమ మేధస్సు వైపు మళ్లుతుండటం, ఉద్యోగులకు తిరిగి శిక్షణ ఇచ్చే అవకాశం లేకపోవడంతోనే ఈ కోతలు తప్పలేదని సీఈఓ జూలీ స్వీట్ తెలిపారు.