
పోలీసులకు సమాచారం ఇచ్చిన
ఫోన్ నెంబర్ ఎక్కడ్నించి వచ్చిందన్నదానిపై ఆరా
బస్టాండ్‌ల్లోనూ పోలీసుల తనిఖీలు ముమ్మరం
మన తెలంగాణ/హైదరాబాద్ : హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన రైల్వే, స్థానిక పోలీసులు రైలును ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో నిలిపివేసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ ఆకస్మిక పరిణామం తో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చర్లపల్లి ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఘట్‌కేసర్ పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాలు శుక్రవారం ఉద యం రంగంలోకి దిగాయి. ఘట్‌కేసర్ స్టేషన్‌లో రైలును ఆపిన వెంటనే ప్రతి బోగీలోకి ప్రవేశించి అణువణు వునా సోదాలు నిర్వహించారు. అను మానం వచ్చిన ప్రతి వ్యక్తిని ప్రశ్నించడంతో పాటు, వారి వెంట ఉన్న లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. సుమారు గంటకు పైగా కొనసాగిన ఈ తనిఖీలతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చివరకు, రైలులో ఎలాంటి అనుమానాస్పద వస్తు వులు గానీ, వ్యక్తులు గానీ లేరని పోలీసులు నిర్ధారించుకున్నా రు. అనంతరం రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు, ప్రయాణి కులు ఊపిరి పీల్చుకున్నారు. అనంత రం ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ సికింద్రా బాద్ స్టేషన్‌కు బయలుదేరి వెళ్లింది. రైల్వేస్టేషన్ల లోనూ భద్రతను కట్టు దిట్టం చేశారు. ఫలక్ నుమా ఎక్స్‌ప్రెస్ లో ఉగ్రవాదులున్నా రంటూ గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడని తెలిసింది. పోలీసులకు సమాచారం ఇచ్చిన ఫోన్ నెంబరు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. బస్టాండ్లలోనూ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటుపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వదేశంలోనే ఉంటూ టెర్రరిస్టులకు ఉప్పందిస్తున్న వారిపై ఎన్‌ఐఏ పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సంగతి విదితమే. ఈ మేరకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు స్లీపర్‌సెల్స్‌తో పాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అందిన సమాచారంతో ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు కొనసాగించడం గమనార్హం.