అమరావతి: ప్రయాణికుడిపై ఆర్టీసీ డ్రైవర్ దాడికి పాల్పడిన సంఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట మండల పరిధిలో జరిగింది. ప్రయాణికులు ఎక్కుతుండగా బస్సు ముందుకు కదలడంతో ఓ ప్రయాణికులు వాహనం ముందు నిలబడి ఆపాడు. దీంతో డ్రైవర్ కోపంతో ఊగిపోయింది కిందకు దిగి ప్రయాణికుడి చెంప చెళ్లుమనిపించడంతో పాటు అతడిపై దాడి చేశాడు. ప్రయాణికుడిని బస్సు వెనక వైపు తీసుకెళ్లి అతడిపై డ్రైవర్ దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బస్సు జగ్గంపేట నుంచి గోకవరం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సదరు ప్రయాణికుడు మద్యం మత్తులో ఉన్నట్టు సమాచారం. ఫ్రీ బస్సు కావడంతో ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణిస్తుండడంతో తాము ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుందని ఆర్ టిసి సిబ్బంది తెలిపారు.
Also Read: బాలికను తుపాకీతో కాల్చి… ప్రేమోన్మాది ఆత్మహత్య