భారతదేశంలోని ఎనిమిదవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ కోఫోర్జ్ (Coforge) షేర్ ధర గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా 14% కుప్పకూలింది. దీంతో, ఏప్రిల్ 2025 తర్వాత ఒక వారంలో ఇంత భారీ నష్టాన్ని చవిచూడటం ఇదే మొదటిసారి. హెచ్-1బీ వీసా ఫీజు పెంపు, కొత్త లాటరీ విధానంపై ప్రతిపాదనలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.