ఐక్యరాజ్యసమితి : భారత- పాకిస్తాన్ తో సహా ప్రపంచవ్యాప్తంగా ఏడు యుద్ధాల ను తానే ఆపగలిగానని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్ ట్రంప్ పునరుద్ఘాటించా రు. ఐక్యరాజ్యసమితి వేదికగా 80వ జ నరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రపంచనాయకులనుద్దేశించి ఆయన మంగళవారం నాడు ప్రసంగించారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యత లు చేపట్టిన తర్వాత ఐక్యరాజ్యసమితి పోడియం నుంచి తొలిసారి ట్రంప్ ప్ర సంగించారు. ఆయా దేశాల మధ్య జ రుగుతున్న యుద్ధాలను ఆపడంలో ఐరా స ఘోరంగా విఫలమైందని తీవ్ర ఆరో పణలు చేశారు. ఐరాస చేయాల్సిన పను లను నేను చేస్తున్నానని వ్యాఖ్యానిం చా రు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడు నె లల కాలలో ఏడు యుద్ధాల కు తానే స్వస్తి పలికానని ఆయన తెలిపారు. వీ టిలో దాదాపు 36 ఏళ్లుగా సాగుతున్న యుద్ధం, రెండు 31 ఏళ్ల పాటు కొనసాగిన యుద్ధాలు , 28 ఏళ్లుగా ము గింపు అన్నదే లేకుండా సాగిన మరో సమరం ఉన్నాయని ప్రెసిడెంట్ అన్నా రు. ఎన్నో ఏళ్లపాటు ముగింపు అన్నదే లేకుండా ఉధృతంగా సాగిన యుద్ధా లు.కంబోడియా- థాయిలాండ్, కొసావో -సెర్బియా, కాంగో -రువాండాతో పాటు, భారత-పాకిస్తాన్, ఇజ్రాయెల్ -ఇరాన్, ఈజిప్ట్ – ఇథియోపియా, అర్మేనియా అజర్ బైజాన్ వంటి హింసాత్మక యుద్ధాలు తన ప్రమేయంతోనే ఆగిపోయాయని డోనాల్ట్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ యుద్ధాలలో లక్షలాది మంది మరణించిన విషయాన్ని గుర్తు చేశారు.
డమ్మీగా మారిన ఐరాస, యుద్ధ నివారణ చర్యలేవీ?
ప్రపంచంలో శాంతిని సుస్థిరం చేసే లక్ష్యంతో ఏర్పడిన ఐక్యరాజ్యసమితి డమ్మీగా మారిందని అమెరికా ప్రెసిడెంట్ ఎత్తి పొడిచారు. 156 మందికి పైగా ప్రపంచ నాయకులు, ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారుల సమక్షంలో ట్రంప్ అంతర్జాతీయ సంస్థను తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రపంచ శాంతి కోసం, వివిధ యుద్ధాలకు ముగింపు పలికేందుకు తాను కృషి చేస్తుంటే, ఐక్యరాజ్యసమితి ఆ అంశంలో తనను బొత్తిగా సంప్రదించలేదని ట్రంప్ విమర్శించారు. ఐక్యరాజ్యసమితికి అపారమైన సామర్థ్యం ఉందని తాను ఎన్నడూ చెబుతూ ఉంటానని, అయితే ఆ సంస్థ తన సామర్థ్యానికి తగినట్లు కృషిచేయలేదని ఆయన అభిప్రాయపడ్డారు. తీవ్ర పదజాలంతో లేఖలు రాయడం వల్ల , మాటల వల్ల యుద్ధాలు పరిష్కారం కావు అని హితవు చెప్పారు. ప్రపంచ దేశాల ప్రతినిధుల సమక్షంలో అమెరికా అంత గొప్పదేశం ప్రపంచంలో లేదని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచంలో వ్యాపారం చేసేందుకు అమెరికాను మించిన దేశం లేదన్నారు. తాను రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఆర్థికవ్యవస్థ మరింత బలోపేతం అయిందని ఆయన వివరించారు.
రష్యా యుద్ధానికి నిధులు అందిస్తున్న భారత్, చైనా
రష్యానుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా ఉక్రెయిన్ తో రష్యా యుద్ధానికి భారతదేశం, చైనా ప్రధానంగా నిధులు అందిస్తున్నాయని ట్రంప్ ఆరోపించారు. రష్యా చమురు కొనుగోలుకు జరిమానాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించింది. దీంతో అమెరికా ఇండియాపై విధించిన సుంకాలు 50 శాతానికి చేరాయి. ప్రపంచంలోనే ఒక దేశంపై అమెరికా విధించిన అత్యధిక సుంకాలు ఇవి. అమెరికా విధించిన సుంకాలను అన్యాయమైనదని, అసమంజసమైన నిర్ణయం అని భారతదేశం పేర్కొంది
Also Read: స్థానిక ఎన్నికల ముందే కులగణన వివరాలు ప్రకటించాలి: కల్వకుంట్ల కవిత